E-Paper
Advertisement

పాలతో ఇంట్లోనే అదిరిపోయే కలాకండ్..నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!

పాలతో ఇంట్లోనే అదిరిపోయే కలాకండ్..నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!
Advertisement

Kalakand recipe: స్వీట్లలో కలాకండ్‌కు ఉండే క్రేజే వేరు. పేరు వినగానే.. నోట్లో నీళ్లు ఊరే ఈ తియ్యటి పదార్థం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. మార్కెట్లో కొనే కలాకండ్ చాలా ఖరీదుగా ఉండటమే కాకుండా.. అందులో రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా.. స్వచ్ఛమైన పాలతో ఇంట్లోనే కలాకండ్ తయారు చేసుకుంటే.. ఆ రుచే వేరు. పర్ఫెక్ట్ కలాకండ్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

చిక్కటి పాలు- 1.5 లీటర్లు

Advertisement

నిమ్మరసం లేదా వెనిగర్ – 2 స్పూన్లు

పంచదార – అర కప్పు ( రుచికి తగినట్లుగా)

Advertisement

నెయ్యి – 2 స్పూన్లు

యాలకుల పొడి – అర స్పూన్

పిస్తా లేదా బాదం తరుగు – కాస్త

తయారీ విధానం:

1. ముందుగా ఒక మందపాటి గిన్నె లేదా కడాయి తీసుకుని అందులో 1 లీటర్ చిక్కటి పాలను పోయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పాలు బాగా మరిగే.. వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు పొంగుకొచ్చిన తర్వాత మంటను తగ్గించి, పాలు సగం అయ్యే వరకు మరిగించాలి.

2. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. పాలు కాస్త వేడిగా ఉన్నప్పుడే (మరీ మరుగుతున్నట్లు కాకుండా) అందులో కొద్ది కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేస్తూ గరిటెతో మెల్లగా కలపాలి. పాలు పూర్తిగా విరిగి పనీర్ (విడిపోయిన భాగం), నీరు వేరుపడతాయి. ఇప్పుడు ఒక పల్చని కాటన్ క్లాత్‌లో ఈ మిశ్రమాన్ని వడకట్టి, పైన చల్లటి నీళ్లు పోయాలి. దీని వల్ల నిమ్మరసం పులుపు పోయి పనీర్ ఫ్రెష్‌గా ఉంటుంది. క్లాత్ ను గట్టిగా పిండి అదనపు నీటిని తొలగించాలి.

3. ఇప్పుడు మరో కడాయిలో మిగిలిన అర లీటర్ పాలను పోసి కొద్దిగా చిక్కబడే వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పనీర్‌ను అందులో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పనీర్ , పాలు బాగా కలిసిపోయి దగ్గరగా పడుతున్నప్పుడు..అందులో పంచదార వేయాలి. పంచదార కరిగిన తర్వాత అది మళ్లీ కొద్దిగా పల్చగా మారుతుంది.

Also Read: నోట్లో వేస్తే కరిగిపోయే గోధుమ హల్వా..ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!

4. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మిశ్రమం గిన్నె అడుగు అంటకుండా గరిటెతో తరచూ కలుపుతూ ఉండాలి. స్వీట్ గట్టిపడుతున్న సమయంలో రెండు స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేయాలి. తర్వాత స్వీట్ ప్యాన్ నుంచి విడిగా అయ్యి దగ్గరగా ముద్దలా అయ్యే వరకు ఉడికించాలి.

5.తర్వాత ఒక ప్లేట్ లేదా ట్రేకి కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసుకున్న కలాకండ్ మిశ్రమాన్ని అందులో వేసి సమానంగా సర్దాలి. పైన సన్నగా తరిగిన పిస్తా లేదా బాదం ముక్కలతో గార్నిష్ చేసి ప్రెస్ చేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో చాకుతో కట్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెడీ!

బయట దొరికే కల్తీ మిఠాయిలకు దూరంగా, స్వచ్ఛమైన పాలతో ఇంట్లోనే ఈజీగా కలాకండ్ తయారు చేసుకోండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ అద్భుతమైన రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.

Related News

అమ్మమ్మ కాలం నాటి అరుదైన వంటకం.. వెదురు చిగుళ్ల కూర తింటే ఇన్ని లాభాలా?

రెస్టారెంట్ స్టైల్ మఖాన కర్రీ..ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, గిలిగింతలు పెట్టడం చేస్తున్నారా? పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయకూడదు

నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!

ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈ ఆదివారం ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి!

మనుషులను వణికిస్తున్న ‘షమోండా వైరస్’.. తొలి మరణం నమోదు, అసలేంటీ వింత వ్యాధి?

Big Stories

Advertisement
×