E-Paper
Advertisement

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. నామినేషన్లను అడ్డుకుంటున్నారు టీడీపీ లీడర్లు. దీనిపైనే వైసీపీ భగ్గుమంటోంది. వైసీపీ అధినేత జగనైతే.. ఇది నామినేషన్ల రిగ్గింగ్ అంటున్నారు. అధికార పార్టీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. పరిస్థితుల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం అష్ట కుట్రలకు తెరలేపిందన్నారు.

అప్పట్లో.. ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారు.. ఎక్కడున్నా వదిలిపెట్టేదే లేదంటున్నారు జగన్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే.. లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. 2021లో ఇలాంటి సిచ్యువేషనే టీడీపీకి ఎదురైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను.. తెలుగుదేశం బహిష్కరించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగట్లేదని, అధికార వైసీపీ హింసాకాండకు, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును, హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

పోటీ పోటీనే అంటూ.. బరిలోకి దిగిన వైసీపీ

Advertisement

అప్పుడు కేవలం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం బరిలో నిలిచింది. పరిషత్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసింది. అయితే ఆనాటి ఎన్నికలకు, ఇప్పటి స్థానిక ఎన్నికలకు.. కంప్లీట్ కాంట్రాస్ట్ సీన్ కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా సరే.. జగన్, ఆయన పార్టీ క్యాడర్ వెనక్కి తగ్గడం లేదు. పోటీ పోటీనే అంటున్నారాయన. వైసీపీ క్యాడర్ కూడా ఎక్కడా సైలెంట్ అవడం లేదు. పరిస్థితులు ఎంత వైలెంట్‌గా ఉన్నా.. ఈట్ కా జవాబ్ పత్తర్ సే అన్నట్లుగా.. ఢీ అంటే ఢీ అంటున్నారు.

జగన్ ధైర్యం ఏమిటీ?

జగన్ ఎందుకు పోటీ నుంచి వెనక్కి తగ్గట్లేదు? ఇదే.. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్‌కు దారితీసింది. గ్రౌండ్‌లో జరుగుతున్న పొలిటికల్ వయలెన్స్ చూశాక కూడా.. వైఎస్ జగన్ ఎన్నికలను ఇంత సీరియస్‌గా తీసుకోవడానికి రీజనేంటి? అనే చర్చ మొదలైంది. వైసీపీది మెజారిటీ స్థానాలు గెలుస్తామన్న ధైర్యమా? లేక కూటమి ప్రభుత్వం పనితీరేంటో ప్రజాతీర్పుతో తేలిపోతుందనే లెక్కలా? జగన్ ధైర్యమేంటనేదే.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్!

Advertisement

Also Read:  మాజీ మంత్రి విడదల రజినీని కిందకి తోసేసిన ఎస్ఐ

Note: Image Created with AI

Tags

Related News

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?

తెలంగాణలో సోలార్ గ్రామాల ప్రాజెక్ట్ సిద్దం.. ఇందులో మీఊరి పేరు ఉందా..?

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

Big Stories

Advertisement
×