E-Paper
Advertisement

ఒక వైపు ట్రోలింగ్.. మరోవైపు రికార్డులు ఓటీటీలో ‘ది ప్యారడైజ్’ సంచలనం!

ఒక వైపు ట్రోలింగ్.. మరోవైపు రికార్డులు ఓటీటీలో ‘ది ప్యారడైజ్’ సంచలనం!
Advertisement

The Paradise OTT: నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదల ఈ నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.

నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్ హవా..

ఇక ఈ సినిమా థియేటర్ వెర్షన్ కాకుండా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తూ కొత్త వెర్షన్ లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో భారీగా నెగిటివిటీని ఎదుర్కొంది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (Net Flix)లో ప్రసారం అవుతున్నప్పటికీ ఒకవైపు ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు అయితే ఈ విమర్శలు అన్నింటిని దాటుకొని ది ప్యారడైజ్ ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక్కడ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఆదరణను సొంత చేసుకుంది.

ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ లో ప్యారడైజ్ ..

Advertisement

ఈ సినిమా ప్రస్తుతం వివిధ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతూ ఇండియా వైడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇలా నెగెటివిటీని తట్టుకొని ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ ఛార్ట్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎన్ని రోజులు ఇలాంటి హవా కనబరుస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో నాని ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తల్లి కొడుకుల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.

నాని సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్..

ఇలా ఈ సినిమా పట్ల నెగెటివిటీ స్ప్రెడ్ చేయడంతో కొన్ని ప్రాంతాలలో భారీ స్థాయిలో కలెక్షన్లు పడిపోయాయని కేవలం నైజాం ప్రాంతంలో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతమ అందించారు. ఈ సినిమాలో ఖయాదు లోహర్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా పూర్తి కావడంతో నాని ప్రస్తుతం బ్లడీ రోమియో(Bloody Romeo) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: ‘గరివిడి లక్ష్మి’ సినిమాని ఇంత మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా?

Related News

నెట్‌ఫ్లిక్స్‌లో 19 తమిళ సినిమాల లైనప్‌… ఈ లిస్టులో మీ ఫేవరెట్‌ ఏది ?

కీర్తి సురేష్ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ… ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ షురూ

36 ఏళ్ల బ్యాచిలర్‌ కు చెప్పుకోలేని కష్టాలు… పెళ్లయినా శోభనం మాత్రం జరగదు… మలయాళ టైమ్‌ లూప్‌ కామెడీ తెలుగులో

ఆడియన్స్ కు అదిరిపోయే వీకెండ్… ఏకంగా 8 సినిమాలు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజే 7 సినిమాలు..!

90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

మరువలేని స్టార్ హీరో మరుగున పడిపోతే… హీరోలను ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ డోంట్ మిస్… వైరల్ సిరీస్

Big Stories

Advertisement
×