E-Paper
Advertisement

Orange for Mental Health: మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ ఈ పండు తింటే చాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్!

Orange for Mental Health: మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ ఈ పండు తింటే చాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్!
Advertisement

Orange for Mental Health: ఆరెంజ్ కేవలం రుచికరమైన ఫ్రూట్ మాత్రమే కాదు.. శరీరానికి, మానసిక ఆరోగ్యానికి కూడా అసాధారణ లాభాలను అందించే సహజ వరం. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే నారింజ పండును ‘సూపర్ ఫుడ్’ అని కూడా చెబుతారు. రోజూ ఒక నారింజ తినడం వలన మూడ్‌ను మెరుగుపరచి, డిప్రెషన్ ప్రమాదాన్ని సుమారు 20 శాతం వరకు తగ్గించగలదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి, డిప్రెషన్ పరార్:

ఆరెంజ్‌లో విటమిన్ C అధికంగా ఉండటం వలన మానసిక ఆరోగ్యానికి అమూల్యమైన లాభాలను అందిస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. దీనిలోని విటమిన్ C, న్యూరాన్లు సరైన అభివృద్ధికి సహాయపడటమే కాక.. మెదడులోని రసాయనాల సమతౌల్యాన్ని కాపాడుతుంది. దీంతో న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ల వేగం పెరిగి, మెదడులో కీలక రసాయనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతోపాటు, విటమిన్ C రక్త నాళాలను హెల్దీగా ఉంచి, మెదడుకు సరైన రక్తప్రవాహాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఒక ఆరెంజ్ తింటే.. మన శరీరానికి కావాల్సిన విటమిన్ C అవసరాన్ని తీరుస్తూ, మూడ్‌ను మెరుగుపరచి, మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నారింజ పండ్ల వలన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

Advertisement

Also Read: కోడిగుడ్లు నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కే!

మెరిసే చర్మం:

నారింజ పండ్లలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. రోజూ నారింజ తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోవడమే కాకుండా, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

Advertisement

నారింజ పండ్లు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం ద్వారా సీజనల్‌గా వచ్చే ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల సమస్యలతో పోరాడటానికి సహాయం చేస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది:

నారింజలోని పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షణ కల్పిస్తాయి.

ఎముకలు బలంగా:

నారింజ పండ్లలో విటమిన్ C, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు.. నారింజ పండ్లు మన శారీరక స్థిరత్వం, శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Also Read: ఏదో ఒకటి తినేస్తామంటే కుదరదంటున్న నిపుణులు.. తినేటప్పుడు తప్పక పాటించాల్సిన రూల్స్ ఇవే!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×