E-Paper
Advertisement

Road Accident: గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం.. సడన్‌గా బ్రేక్ వేయడంతో…

Road Accident: గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం.. సడన్‌గా బ్రేక్ వేయడంతో…
Advertisement

ఖమ్మం జిల్లాలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పెనుబల్లి మండలం బంజర్ రింగ్ సెంటర్‌లో గ్రానైట్ లారీపై నుంచి అకస్మాత్తుగా మూడు పెద్ద గ్రానైట్ రాళ్ళు కిందపడిపోయాయి. ప్రమాద సమయంలో ఎవ్వరూ అక్కడ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు గ్రానైట్ రాళ్ళతో వెళ్తుండగా బంజర్ రింగ్ సెంటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ఆటో స్టాండ్ దగ్గర లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో..ఈ ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ పెను బీభత్సం సృష్టించింది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు భారీ గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న ఈ లారీ  బంజర్ రింగ్ సెంటర్‌లో ప్రమాదానికి గురైంది.

Advertisement

స్థానిక ఆటో స్టాండ్ సమీపంలోకి రాగానే.. లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో లోడ్ సరిగా కట్టకపోవడం వల్లా లేక బ్రేక్ ప్రభావం వల్లా తెలీదు కానీ లారీపై నుంచి అకస్మాత్తుగా మూడు పెద్ద గ్రానైట్ రాళ్లు కిందపడిపోయాయి. ఒక్కొక్కటి టన్నుల బరువు ఉండే ఈ రాళ్లు రోడ్డుపై పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే  ఈ ప్రమాదం జరిగిన సమయంలో  ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆటో స్టాండ్ వద్ద రద్దీ ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో  ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉండి ఉంటే పెను విషాదం చోటుచేసుకునేది. డ్రైవర్ అజాగ్రత్త, లోడ్‌ను సరిగా కట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాళ్లను తొలగించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×