Citroen Elo Concept Car: ఫ్రెంచ్ ఆటో మేకర్ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు క్రేజీ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వినియోగదారుల అభి రుచులకు అనుగుణంగా అద్భుతమైన కార్లను రూపొందిస్తుంది. అందులో భాగంగానే సిట్రోయెన్ ఎలో అనే కారును తాజాగా లాంచ్ చేసింది. “Small is the New Big” అనే థీమ్‌తో దీనిని రూపొందించింది. భవిష్యత్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ వెహికల్స్‌కు ఐడియాల ల్యాబ్‌లా నిలువబోతోంది. కాంపాక్ట్ సైజ్ లో ఎక్కువ స్పేస్, ఫంక్షనాలిటీని అందించనుంది. జనవరి 9న బ్రస్సెల్స్ మోటార్ షోలో దాని గ్లోబల్ ప్రీమియర్ కోసం రెడీ చేసింది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏంటి? ఎంత మంది వెళ్లొచ్చు? లాంటి కంప్లీట్ డీటైల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సిట్రోయెన్ ఎలో కారు 4.10 మీటర్ల పొడవు ఉంటుంది. చాలా కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే చిన్నది అయినప్పటికీ ఆరుగురు వరకు కూర్చోవడానికి వీలవుతుంది. మొత్తం 6 సీట్లను కలిగి ఉంటుంది. సెంట్రల్ డ్రైవర్ సీట్, రెండో రోలో 3 సీట్లు, ఎక్స్ ట్రా జంప్ సీట్లు ఉంటాయి. రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ తో ఇంటీరియర్ XXL స్పేస్ ను కలిగి ఉంటుంది. 180 డిగ్రీల పనోరమిక్ వ్యూను అందిస్తుంది. రెండు అదనపు సీట్లను విప్పే అవకాశం ఉంటుంది. డ్రైవర్ సీటు కూడా 360 డిగ్రీలు తిరుగుతుంది. క్యాబిన్ ను వర్క్ స్పేస్ హబ్ గా మార్చుకోవచ్చు.
ఈ కారు బూట్ లో రెండు ఇన్ ఫ్లేటబుల్ మ్యాట్రెస్‌లు ఉంటాయి. ఓపెనబుల్ రూఫ్ తో చక్కగా పడుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెస్ట్ తీసుకోవచ్చు. అటు రిమూవబుల్ సీట్లను బయట చైర్లుగా ఉపయోగించుకోవచ్చు. V2L పవర్ సప్లై (గ్రిల్, స్పీకర్ పవర్), స్మార్ట్ టైర్లు, ప్రెషర్ LED ఇండికేటర్ ను కలిగి ఉంటుంది. డ్రైవర్ సీట్ 360° రొటేట్, ఫోల్డబుల్ టేబుల్, ప్రొజెక్టర్ తో స్క్రీన్ ప్రొజెక్షన్ ఉంటుంది. వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. సినిమాను చూడవచ్చు. సిట్రోయెన్ ఎలోను ‘చక్రాలపై నడిచే చిన్న ఇల్లు’గా చెప్పుకోవచ్చు.
సిట్రోయెన్ ఎలో కారు బోల్డ్, ఆరెంజ్ కలర్, ఫ్లాట్ ప్యానెల్స్, స్లైడింగ్ డోర్స్ ను కలిగి ఉంటుంది. 30% రీసైకిల్డ్ మెటీరియల్స్, 100% రీసైకిలబుల్ మెటీరియల్స్ ను ఉపయోగించి తయారు చేయబడింది. లైట్ వెయిట్ పాలీప్రొపైలీన్ బంపర్స్ ను కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే.. మంచి విజిబిలిటీతో సెంట్రల్ డ్రైవింగ్ పొజిషన్ ను కలిగి ఉంటుంది. ప్రొజెక్టెడ్ HUD డిస్ ప్లే, సింగిల్ స్పోక్ స్టీరింగ్ ఉంటుంది. ఇది కేవలం ప్రొడక్షన్ మోడల్ కాదు. కానీ, భవిష్యత్ సిట్రోయెన్ ఎలక్ట్రిక్ MPVలకు ఇన్‌స్పిరేషన్. ఇది ఆహ్లాదకరమైన, సస్టైనబుల్ ఫ్యామిలీ మొబిలిటీకి కేరాఫ్ గా మారనుంది. జనవరిలో జరగబోయే బ్రస్సెల్స్ మోటార్ షో-2026లో కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది.
Read Also: అదిరిపోయే ఫీచర్లే, క్రేజీ లుక్.. 2026లో ఎంట్రీ ఇవ్వబోతున్న టాటా కార్లు ఇవే!