E-Paper
Advertisement

ఇతరుల గురించి చెడుగా గాసిప్స్ చేస్తూ ఉంటారా? ఈ అలవాటుతో మీ గ్రహాలు బలహీనం.. ఎలాగంటే

ఇతరుల గురించి చెడుగా గాసిప్స్ చేస్తూ ఉంటారా? ఈ అలవాటుతో మీ గ్రహాలు బలహీనం.. ఎలాగంటే
Advertisement

చాలామంది ఇతరుల గురించి వారు లేనప్పుడు మాట్లాడటం సాధారణ విషయంగా భావిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదు. ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల జీవితంలో నెగటివిటీ పెరుగుతుంది. మనసులో ప్రశాంతత తగ్గిపోతుంది. సంబంధాలలో కూడా దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గాసిప్ అలవాటు కారణంగా గురు, చంద్రుడు, బుధుడు అనే మూడు గ్రహాలు బలహీనపడుతాయి. ఈ గ్రహాలు మన జీవితంలో గౌరవం, మానసిక శాంతి, మాట తీరు వంటి విషయాలను ప్రభావితం చేస్తాయి.

గురుగ్రహంపై ప్రభావం

Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని జ్ఞానం, గౌరవం, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. గురుగ్రహం బలంగా ఉంటే వ్యక్తికి మంచి పేరు వస్తుంది. సంబంధాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల కనిపిస్తుంది. కానీ ఎప్పుడూ గాసిప్ చేయడం వల్ల గురుగ్రహం బలహీనమవుతుంది. దీంతో ఇతరుల విశ్వాసం తగ్గుతుంది. సమాజంలో గౌరవం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

బలహీనమైన గురుగ్రహ లక్షణాలు

గురుగ్రహం బలహీనంగా ఉంటే జీవితంలో గందరగోళం పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. సంబంధాలలో అపార్థాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యక్తులు తరచూ అసంతృప్తిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఆందోళన చెందుతూ మానసికంగా ప్రశాంతత కోల్పోతారు.

చంద్రుడితో మాననిక సంబంధం

Advertisement

చంద్రుడు మన భావోద్వేగాలు మరియు మానసిక శాంతిని సూచిస్తాడు. ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం వల్ల మనసు అశాంతిగా మారుతుంది. నెగటివ్ మాటలు ఒత్తిడిని పెంచుతాయి. దీంతో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అనవసర ఆలోచనలు ఎక్కువవుతాయి. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడే పరిస్థితి వస్తుంది.

బలహీనమైన చంద్రుడి లక్షణాలు

చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సమస్యలు రావచ్చు. ఎప్పుడూ టెన్షన్‌గా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు సులభంగా భావోద్వేగాలకు లోనవుతారు. పనులపై దృష్టి పెట్టడం కూడా కష్టమవుతుంది. కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

బుధుడిపై నెగటివ్ మాటల ప్రభావం

బుధ గ్రహం.. మాట తీరు, తెలివిని సూచిస్తుంది. ఇతరులను విమర్శించడం వల్ల బుధుడు బలహీనమవుతాడు. దీంతో మాట్లాడే విధానంలో సమస్యలు వస్తాయి. సంబంధాలలో అపార్థాలు పెరుగుతాయి. స్నేహితులతో కూడా దూరం ఏర్పడుతుంది. వ్యక్తి తన భావాలను సరిగ్గా చెప్పలేకపోతాడు.

Also Read: అదృష్టవంతులకు మాత్రమే కలలో ఈ వస్తువులు కనిపిస్తాయి.. మీకూ కనిపిస్తున్నాయా?

గ్రహాలను బలంగా ఉంచేందుకు చేయాల్సినవి

మంచి ఆలోచనలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇతరులతో గౌరవంగా మాట్లాడాలి. గాసిప్, విమర్శలను పూర్తిగా దూరంగా ఉంచాలి. సహాయం చేసే మనస్తత్వం పెంచుకోవాలి. నిజాయితీగా ఉండటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మంచి మాటలు సంబంధాలను బలపరుస్తాయి.

గాసిప్ చేయడం చిన్న విషయం అనిపించినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నెగటివ్ మాటలు మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ముఖ్యమైన గ్రహాలను బలహీనపరుస్తుంది.

మంచి మాటలు, మంచి ఆలోచనలు జీవితాన్ని సంతోషంగా మారుస్తాయి. సానుకూల ప్రవర్తన వల్ల గౌరవం, ప్రశాంతత, మంచి సంబంధాలు పెరుగుతాయి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×