E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గోల్డ్ చైన్ తిరిగి తీసుకొచ్చిన రాజు 

Brahmamudi Serial Today Episode May 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: గోల్డ్ చైన్ తిరిగి తీసుకొచ్చిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: రాజు కోపంగా నేను అద్దె మొగుడినే కదా అంటూ తిడుతుంటే.. అపర్ణ విని ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అంటూ వస్తుంది. అపర్ణను చూసిన రాజు షాక్‌ అవుతాడు. వెంటనే రాజు తేరుకుని మాట మారుస్తాడు. ఏదేదో చెప్పి అపర్ణను ఏమారుస్తాడు. ఇంతలో అపర్ణ ఇందు మెడలో గొల్డ్‌ చైన్‌ లేదని ఏమైందని అడుగుతుంది. దీంతో ఇందు అది బెడ్‌ రూంలో మర్చిపోయానని చెప్పగానే.. ఇంత లైట్‌ తీసుకుంటున్నావేంటే.. అది మీ అమ్మ జ్ఞాపకార్థం అది ఒక్కరోజు కనిపించకపోతే రోజంతా భోజనం చేయలేదు కదా.. అంటూ చెప్తుంటే రాజు విని షాక్‌ అవుతాడు. ఇందు మాత్రం ఆ చైన్‌ బెడ్‌ రూంలో ఉంది నేను వేసుకుంటాను అంటూ ఇందు రూంలోకి వెళ్లిపోతుంది. ఇందు వెళ్లాక అపర్ణ బాధగా ఆ గొల్డ్‌ చైన్‌ గురించి చెప్తూ.. బాధపడుతుంది. దీంతో రాజు మనసులో బాధపడతాడు.

రూంలో ఆంటోనికి మందు ఇచ్చి వాళ్ల అమ్మ గురించి చెప్పమని అడుగుతుంటాడు లక్కీ. ఆంటోని మాత్రం మీ అమ్మను ఎలాగైనా పట్టుకుని చెప్తాను అంటూ తాగి పడిపోతాడు. ఇంతలో లక్కీకి రాజు ఫోన్‌ చేసి తను చెప్పిన దగ్గరకు రమ్మని చెప్తాడు. లక్కీ సరే అంటూ బయలుదేరుతాడు. మరోవైపు రాకేష్‌, ఐశ్వర్యకు ఫోన్‌ చేసి డబ్బుల గురించి అడుగుతాడు. ఐశ్వర్య తనతో డబ్బులు లేవని.. చెప్పగానే.. రాకేష్‌ కోపంగా ఫోన్‌ ఇందుకు ఇవ్వమని చెప్తాడు. ఆరోజు ఇందు చెప్పినందుకే తాను టైం ఇచ్చినట్టు చెప్తాడు. దీంతో ఐశ్వర్య ఫోన్‌ ఇందుకు ఇస్తే.. ఇందు ఐశ్వర్య డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను కొంచెం ఆగండి అని ఇందు చెప్పగానే.. రాకేష్‌ రెండు రోజులు టైం ఇస్తూ.. కాల్‌ కట్‌ చేస్తాడు.

Advertisement

లక్కీని కలిసిన రాజు ఎలాగైనా ఇందు ఇచ్చిన నెక్లెస్‌ విడిపించాలని అందుకోసం డబ్బులు కావాలని చెప్పగానే.. లక్కీ షాక్‌ అవుతాడు. డబ్బు కోసం ఏమీ ఆలోచించకుండా ఏ పనైనా చేసేవాళ్లం కదరా.. ఒక్కసారిగా ఇలా మారిపోయావేంట్రా అని లక్కీ అడగ్గానే.. రాజు నేనేం మారలేదురా..? అంటాడు. దీంతో లక్కీ నువ్వు చాలా మారిపోయావురా..? చివరికి నీ క్యారెక్టరే మారిపోయింది. ఒక వెధవ లోఫర్‌ గాడి జీవితంలోకి మంచి అమ్మాయి వస్తే వాడు మంచి వాడిగా మారిపోతాడని వాళ్లు వీళ్లు చెబితే విన్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానురా అని చెప్పగానే.. రాజు ఎవడ్రా ఆ లోఫర్‌ గాడు అని అడగ్గానే.. నువ్వేరా.. అని లక్కీ చెప్పగానే.. రాజు కోపంగా తిడతాడు. ఆ నెక్లెస్‌ వాళ్ల అమ్మ జ్ఞాపకంరా ఎలాగైనా ఆ నెక్లెస్‌ తీసుకొచ్చి ఇవ్వాలి అంటూ వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన రాజు గోల్డ్‌ చైన్‌ తీసి ఇందుకు ఇస్తాడు. ఇందు చాలా సంతోషిస్తుంది. ఎలా తీసుకొచ్చావని అడుగుతుంది. ఎలాగోలా తీసుకొచ్చాను తీసుకో అంటూ చెప్పి నా డబ్బులు మాత్రం నాకు కరెక్టుగా ఇవ్వాలి అంటూ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు వెంకట్‌ కు జాబ్‌ వస్తుందని చలపతి, వస్తే చాలా సంతోషమని లక్ష్మీ ఆనందపడుతుంటారు. ఇంతలో ఇంటికి వచ్చిన వెంకట్‌ తనకు జాబ్‌ రాలేదని బాధపడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

Big Stories

Advertisement
×