E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్ ఎంత కాలం బాగుంటుంది? తినవచ్చా లేదా?

ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్ ఎంత కాలం బాగుంటుంది? తినవచ్చా లేదా?
Advertisement

వేసవి కాలం వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఒకేసారి ఎక్కువ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు తీసుకుని తింటారు. అయితే ఐస్‌క్రీమ్‌ను ఎంతకాలం ఫ్రీజర్‌లో ఉంచితే సురక్షితంగా ఉంటుందో చాలామందికి తెలియదు. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే దాని రుచి, క్వాలిటీ ఆకృతి మారిపోతాయి. అందుకే ఐస్‌క్రీమ్‌ను ఎంతకాలం నిల్వ చేయాలో తెలుసుకోవడం అవసరం.

ఓపెన్ చేయని ఐస్‌క్రీమ్ ప్యాకెట్లు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి

ఐస్‌క్రీమ్ ప్యాకెట్ తెరవకుండా ఉంటే సాధారణంగా ఒకటి నుంచి రెండు నెలల వరకు ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. అయితే ప్యాకెట్‌పై ఉన్న గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలి. ఫ్రీజర్ వెనుక భాగంలో ఉంచితే చల్లదనం స్థిరంగా ఉండి ఐస్‌క్రీమ్ నాణ్యత ఎక్కువకాలం నిలుస్తుంది.

తెరిచిన ఐస్‌క్రీమ్‌ను త్వరగా తినడం మంచిది

Advertisement

ఒకసారి ఐస్‌క్రీమ్ ప్యాకెట్ లేదా డబ్బా తెరిచిన తర్వాత దాన్ని ఏడు నుంచి పది రోజులలోపు తినేయడం బెస్ట్. ఈ సమయంలో దాని రుచి, తాజాదనం బాగానే ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే క్వాలిటీ క్రమంగా తగ్గుతుంది.

సరైన టెంపరేచర్ చాలా ముఖ్యం

ఐస్‌క్రీమ్‌.. ఎప్పుడూ మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా చేస్తే త్వరగా పాడయ్యే అవకాశం తగ్గుతుంది. అలాగే ఐస్‌క్రీమ్‌కు ఉండే మృదువైన, క్రీమీ షేప్ కూడా అలాగే ఉంటుంది. టెంపరేచర్ తరచుగా మారితే ఐస్‌క్రీమ్ క్వాలిటీ దెబ్బతింటుంది.

ఎక్కువకాలం నిల్వ చేస్తే ఏమి జరుగుతుంది?

Advertisement

ఐస్‌క్రీమ్‌ను చాలా రోజుల పాటు ఫ్రీజర్‌లో ఉంచితే దాని అసలు రుచి తగ్గిపోతుంది. పైభాగంలో మంచు స్ఫటికాలు ఏర్పడవచ్చు. దాని ఆకృతి గరుకుగా మారుతుంది. కొన్నిసార్లు ఫ్రీజర్ వాసన కూడా వస్తుంది. ఇవన్నీ ఐస్‌క్రీమ్ క్వాలిటీ తగ్గిందని సూచించే సంకేతాలు.

ఐస్‌క్రీమ్‌ సరైన విధంగా నిల్వ చేయాలి

ఐస్‌క్రీమ్ తీసుకున్న తర్వాత డబ్బాను బాగా మూసి ఉంచాలి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు. అవసరమైతే ఐస్‌క్రీమ్ పైభాగంలో బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ ర్యాప్ ఉంచవచ్చు. దీని వల్ల ఫ్రీజర్ వాసన ఐస్‌క్రీమ్‌లోకి రాదు. ప్లాస్టిక్ ర్యాప్ అడ్డుకుంటుంది. అలాగే ఐస్‌క్రీమ్‌ తరచుగా బయటకు తీసి మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టకూడదు.

ఐస్‌క్రీమ్ పాడైందని ఎలా గుర్తించాలి?

ఐస్‌క్రీమ్ రుచి విచిత్రంగా అనిపిస్తే దాన్ని తినకూడదు. ఎక్కువగా మంచు పేరుకుపోయినా జాగ్రత్తగా ఉండాలి. గరుకుగా లేదా ఇసుకలాగా అనిపించే టెక్సచర్ ఉంటే ఐస్‌క్రీమ్ పాతబడినట్లు సంకేతం. చెడు వాసన వస్తే వెంటనే పారేయడం మంచిది.

Also Read: మద్యం సేవించే వారికి క్యాన్సర్ ప్రమాదం.. తాగే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

ఈ తప్పులను అసలు చేయకూడదు

కరిగిపోయిన ఐస్‌క్రీమ్‌ను మళ్లీ గడ్డకట్టించడం మంచిది కాదు. అలాగే డబ్బాను తెరిచి ఫ్రీజర్‌లో ఉంచకూడదు. ఎక్కువకాలం నిల్వ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఎప్పుడూ శుభ్రమైన స్పూన్‌తో మాత్రమే తీసుకోవాలి.

ఐస్‌క్రీమ్‌ తాజాగా ఉంచేందుకు జాగ్రత్తలు

మీరు నెమ్మదిగా తినే అలవాటు ఉంటే చిన్న ప్యాకెట్లు కొనడం మంచిది. బలమైన వాసన ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా నిల్వ చేయాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రతను తరచూ పరిశీలించడం కూడా అవసరం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఐస్‌క్రీమ్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది. వేసవిలో మీ ఫేవరెట్ ఐస్‌క్రీమ్ సురక్షితంగా ఎంజాయ్ చేయవచ్చు.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×