E-Paper
Advertisement

Weight loss tips: పది రోజుల్లో 5 కిలోలు తగ్గాలంటే రోజూ ఎంతసేపు నడవాలి?

Weight loss tips: పది రోజుల్లో 5 కిలోలు తగ్గాలంటే రోజూ ఎంతసేపు నడవాలి?
Advertisement

ఇప్పటి కాలంలో చాలా మంది త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. ఒక కిలో బరువు తగ్గాలంటే సుమారు 7,700 కేలరీలు ఖర్చు చేయాలి. అంటే 5 కిలోలు తగ్గాలంటే దాదాపు 38,500 కేలరీలు బర్న్ చేయాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, 10 రోజుల్లో 5 కిలోలు తగ్గాలంటే ప్రతి రోజు సుమారు 3,800 కేలరీలు ఖర్చు చేయాలి. కానీ నడక ద్వారా అంత కేలరీలు బర్న్ చేయడం చాలా కష్టం.

ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే
సాధారణంగా ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేస్తే సుమారు 200 నుంచి 300 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. అంటే రోజుకు 3,800 కేలరీలు బర్న్ చేయాలంటే సుమారు 12 నుంచి 14 గంటలు నడవాల్సి వస్తుంది. ఇది సాధారణ వ్యక్తి ఇలా చేస్తే అనారోగ్యం పాలవుతాడు. సాధారణంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే వారానికి 0.5 నుంచి 1 కిలో వరకు తగ్గడం మంచిదని సూచిస్తున్నారు అంటే 5 కిలోలు తగ్గాలంటే కనీసం 4 నుంచి 8 వారాలు పట్టే అవకాశం ఉంది. త్వరగా తగ్గించాలనే ఆలోచన వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం లేదు.

Advertisement

Also read: Smart Nails: ఈ స్మార్ట్ గోళ్లు అతికించుకుంటే మీకు నచ్చిన గోళ్ల రంగును సెకన్లలో మార్చేసుకోవచ్చు

ఇలా చేయండి
అయితే నడక ద్వారా బరువు తగ్గడం పూర్తిగా అసాధ్యం కాదు. సరైన విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నిపుణుల ప్రకారం రోజుకు 8,000 నుంచి 12,000 స్టెప్స్ నడవడం వల్ల క్రమంగా బరువు తగ్గవచ్చు. ఇది సాధారణంగా 45 నిమిషాల నుంచి 1.5 గంటల వరకు నడకకు సమానం. రోజూ ఒకే టైమ్‌లో, కొంచెం వేగంగా నడిస్తే కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. అదేవిధంగా 10,000 స్టెప్స్ నడిస్తే సుమారు 300 నుంచి 600 కేలరీలు ఖర్చవుతాయని అంచనా.

Advertisement

తినే ఆహారం
కేవలం నడక మాత్రమే బరువు తగ్గడానికి సరిపోదు. మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ నడిస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే తక్కువ చక్కెర, తక్కువ ఆయిల్, ఎక్కువ ప్రోటీన్, కూరగాయలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రోజుకు తగినంత నీరు తాగడం కూడా అవసరం. నడకను మరింత ప్రభావవంతంగా చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ (వేగంగా నడవడం), కొండెక్కడం, మెట్లెక్కడం, వేగాన్ని మారుస్తూ నడవడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. ఫిట్‌నెస్ బ్యాండ్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి మీ స్టెప్స్ ట్రాక్ చేస్తే మరింత మోటివేషన్ వస్తుంది.

Also read: Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే ఈ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?

10 రోజుల్లో 5 కిలోలు తగ్గడం నడకతో సాధ్యం కాదు. రోజుకు గంటల తరబడి నడవాల్సి వస్తుంది. అది ఆరోగ్యానికి హానికరం. కానీ రోజుకు 1 గంట నుంచి 1.5 గంటల వరకు నడవడం, సరైన డైట్ పాటించడం ద్వారా క్రమంగా బరువు తగ్గడం సాధ్యమే. నెమ్మదిగా తగ్గిన బరువే ఎక్కువ కాలం నిలుస్తుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×