E-Paper
Advertisement

Smart Nails: ఈ స్మార్ట్ గోళ్లు అతికించుకుంటే మీకు నచ్చిన గోళ్ల రంగును సెకన్లలో మార్చేసుకోవచ్చు

Smart Nails: ఈ స్మార్ట్ గోళ్లు అతికించుకుంటే మీకు నచ్చిన గోళ్ల రంగును సెకన్లలో మార్చేసుకోవచ్చు
Advertisement

ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ కొత్త టెక్నాలజీలతో మారిపోతుంది. ఇప్పటివరకు గోళ్లకు రంగు వేయాలంటే నెయిల్ పాలిష్ వేసుకుని అది ఆరే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. కొత్తగా మార్కెట్లోకి స్మార్ట్ నెయిల్స్ వస్తాయి. వీటిని కొనుక్కుని మీ గోళ్లకు అతికించుకు సరి. మొబైల్ ఫోన్ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఆ గోళ్ల రంగును మార్చుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.8,500 ఉంటాయి. త్వరగా గోళ్ల రంగు మార్చుకోవాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక.

ఎలా పనిచేస్తాయి?
ఈ స్మార్ట్ నెయిల్స్ పని చేసే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి సాధారణంగా అతికించే నకిలీ గోళ్లలా ఉంటాయి. వీటి లోపల మాత్రం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంటుంది. మొబైల్ యాప్‌తో కనెక్ట్ అయ్యే ఈ గోళ్లు మీరు కావాలనుకున్న రంగును సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆ రంగులోకి మారిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకమైన మ్యాజిక్ వాండ్ అనే చిన్న పరికరంతో గోళ్లపై టచ్ చేస్తే వెంటనే రంగు మారిపోతుంది. ఒక్కో గోరు రంగు మారడానికి సుమారు 5 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ విధంగా మొత్తం గోళ్లను కొన్ని క్షణాల్లోనే కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు లేదా ఆఫీస్‌కు వెళ్లే ముందు త్వరగా రెడీ అవ్వాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

Also read: Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే ఈ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?

300 రంగులకు మించి
ఈ స్మార్ట్ నెయిల్స్‌లో ఉపయోగించే టెక్నాలజీ కూడా ప్రత్యేకమే. ఎలక్ట్రోకెమికల్ లేదా నానోపాలిమర్ టెక్నాలజీ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఇది ఈ-ఇంక్ స్క్రీన్‌లా ఉండి, ఒకసారి రంగు మార్చితే అది అలాగే నిలిచి ఉంటుంది. మళ్లీ కొత్త రంగు కావాలంటే యాప్‌లో ఎంపిక చేసి మళ్లీ మార్చుకోవచ్చు. ఇందులో వందల సంఖ్యలో కలర్స్ అందుబాటులో ఉంటాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం 300 నుంచి 400 వరకు షేడ్స్ ఎంచుకోవచ్చు. అందువల్ల ఒకే రోజు కూడా మీరు పలుమార్లు గోళ్ల రంగును మార్చుకోవచ్చు. మీ డ్రెస్సుకు సరిపోయేలా లేదా మీ మూడ్‌కు తగ్గట్టు రంగు మార్చుకోవడం చాలా సులభంగా మారింది.

Advertisement

Also read: Funerals: మహిళలు శ్మశానంలోని అంత్యక్రియల్లో ఎందుకు పాల్గొనకూడదు? ఈ నియమం ఎవరు పెట్టారు?

వీటిని ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది. నెయిల్ పాలిష్ వేసుకుని అది ఆరే వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. అలాగే పాలిష్ చెడిపోవడం, మచ్చలు పడడం వంటి సమస్యలు ఉండవు. అయితే ఈ గోళ్లను మీరు మీ ఇష్టానుసారం కట్ చేయడం లేదా ఆకారం మార్చడం సాధ్యం కాదు. అలాగే ఇవి ఎంతకాలం మన్నుతాయో ఇంకా తెలియదు. స్మార్ట్ నెయిల్స్ బ్యూటీ రంగంలో టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోయిందో చూపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని డిజిటల్ బ్యూటీ ఉత్పత్తులు రావడం ఖాయం. గోళ్లకు రంగు మార్చుకోవడం ఇప్పటి వరకు సమయం పట్టే పని అయితే ఇప్పుడు అది కేవలం కొన్ని సెకన్ల వ్యవహారంగా మారింది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×