E-Paper
Advertisement

ఫోన్ లేకుంటే పిల్లలు ఏడుస్తున్నారా? ఈ అలవాటు మాన్పించడానికి ఈజీ టిప్స్

ఫోన్ లేకుంటే పిల్లలు ఏడుస్తున్నారా? ఈ అలవాటు మాన్పించడానికి ఈజీ టిప్స్
Advertisement

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి వద్ద ఉంటున్నాయి. ఇంట్లో పిల్లలు సైతం ఫోన్లలో గేమ్స్, వీడియోలు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిపోయింది. చాలా మంది పిల్లలు రోజూ గంటల తరబడి వీడియోలు చూస్తూ లేదా గేములు ఆడుతూ ఉంటారు. ఇలా అధిక స్క్రీన్ టైమ్ వల్ల నిద్ర, కళ్లు, చదువు, ప్రవర్తనపై చెడు ప్రభావం పడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు కోపంగా లేదా బలవంతంగా వారి చేతుల్లో నుంచి ఫోన్ లాగేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా కఠినంగా పిల్లలను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదు. పిల్లలకు మార్గదర్శకత్వం, ఓపిక, మంచి అలవాట్లు నేర్పించడం అవసరం.

పిల్లలకు అధిక స్క్రీన్ టైమ్ వల్ల కలిగే హాని సరిగ్గా వివరించండి

పిల్లలు స్మార్ట్‌ఫోన్ వల్ల జరిగే హాని గురించి అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు వారికి ప్రశాంతంగా, స్పష్టంగా వివరించాలి. ఎక్కువ సేపు మొబైల్ చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి, నిద్ర ఆటంకం కలుగుతుంది. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ మీ ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ పిల్లలకు సాధారణ ఉదాహరణలతో వివరించండి. కోపంగా మాట్లాడం లేదా వారిని నిందించడం చేయకూడదు. ప్రేమతో, స్నేహపూర్వక సంభాషణలు నమ్మకాన్ని పెంపొందిస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగ మాట్లాడిన తరువాత పిల్లల్లో మంచి మార్పులు చూస్తారు.

ఫోన్ బదులుగా సరదా గేమ్స్ ఆడించండి

Advertisement

పిల్లలు బోర్‌గా ఫీల్ అయినప్పుడు ఎక్కువగా ఫోన్ వాడతారు. అందుకే ప్రతిరోజూ వారికి సరదా కోసం మంచి గేమ్స్, యాక్టివిటీస్ చేయించండి. బయట ఆడుకోవడం, సైక్లింగ్, గీయడం, తోటపని లేదా పుస్తకాలు చదవడం ప్రోత్సహించండి. ఇంట్లో పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కూడా స్క్రీన్ అలవాటును సహజంగా తగ్గిస్తాయి. తల్లిదండ్రులు వీకెండ్స్‌లో పిల్లలతో క్వాలిటీ సమయం గడపండి. ఇంటి లోపలే పిల్లలతో గేమ్స్ ఆడించండి, లేదా కలిసి వంట చేయండి. ఇవన్నీ చేస్తే పిల్లలకు ఫోన్ పట్ల ఆసక్తి తగ్గుతుంది.

పిల్లల చేతి నుంచి ఫోన్‌ లాగేసుకోవడం చేయకండి

చాలా మంది తల్లిదండ్రులు కోపంగా పిల్లల చేతి నుంచి ఫోన్ లాగి తీసుకుంటారు. దీని వల్ల పిల్లలు మరింత మొండిగా వ్యవహరిస్తారు. అందుకే తల్లిదండ్రులు ప్రశాంతంగా, ఓర్పుతో ఈ సమస్యను పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా హఠాత్తుగా పిల్లలను బలవంతం చేయడం పిల్లల్లో చిరాకు పెంచుతాయి. ఆరోగ్యం, చదువు కోసం పరిమితులు అవసరమని వివరించండి. ప్రశాంతంగా, గౌరవంగా ఉంటే పిల్లలు మంచి స్పందన ఇస్తారు.

ప్రతిరోజూ స్క్రీన్ టైమ్‌కు సరైన పరిమితులు నిర్ణయించండి

Advertisement

చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైన స్క్రీన్ టైమ్ హద్దులు అవసరం. ప్రతి రోజు ఫోన్ షెడ్యూల్ నిర్ణయించండి. ఇంట్లో మీరు చెప్పే పనులు చేయడం లేదా శారీరక వ్యాయామం తర్వాత మాత్రమే స్క్రీన్ ఉపయోగం అనుమతించండి. భోజన సమయంలో, నిద్ర పోయే ముందు మొబైల్ వాడకూడదు. ఇంట్లో టెక్-ఫ్రీ జోన్లు అంటే బెడ్ రూం, డైనింగ్ టేబుల్ లేదా ప్లే రూంలో ఫోన్లు వాడడాన్ని నిషేధించండి. ఈ చిన్న నియమాలు క్రమశిక్షణను మెరుగుపరుస్తాయి.

Also Read: మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి

పేరెంటల్ కంట్రోల్స్ పెట్టండి

ఫోన్‌ లేదా టీవిలో పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్లు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను సురక్షితంగా పర్యవేక్షించడానికి సహాయపడతాయి. హానికర కంటెంట్‌ను బ్లాక్ చేసి సమయాన్ని పరిమితం చేయవచ్చు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లల ముందు ఫోన్ తక్కువగా వినియోగించాలి. పిల్లలు పెద్దలను చూసి అనుకరిస్తారు. వారితో నేరుగా మాట్లాడండి, సమయం గడపండి.

స్మార్ట్‌ఫోన్ అలవాటు ఒక్కరోజులో తగ్గదు. క్రమంగా ఈ అలవాటుకు మాన్పించాలి. చదువు, ఆట, నిద్ర, కుటుంబ సమయం సమతుల్యంగా ఉండే రొటీన్‌ను ప్రోత్సహించండి. స్క్రీన్ టైమ్ తగ్గించినప్పుడు పిల్లలను ప్రశంసించండి. బలవంతం కంటే స్థిరత్వం ముఖ్యం. ఓర్పుతో పిల్లలకు అర్థమయ్యే విధంగా చెబితే వారు క్రమంగా ఈ వ్యసనం నుంచి బయటపడతారు.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×