E-Paper
Advertisement

మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి

మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి
Advertisement

Parenting Tips| తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు తెలివైనవారు, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. చాలా మంది ఖరీదైన స్కూళ్లు, ప్రైవేట్ ట్యూషన్లపై ఆధారపడతారు. కానీ స్మార్ట్ పేరెంటింగ్ అంటే పిల్లలకు రోజువారీ అలవాట్లు, మానసిక సపోర్ట్ ఇవ్వడం. చిన్న చిన్న సానుకూల అలవాట్లు పిల్లల మానసిక వికాసాన్ని బాగా పెంచుతాయి. ఆరోగ్యకరమైన వాతావరణం పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని సహజంగా అభివృద్ధి చేస్తుంది.

మీ పిల్లలతో అంతా ఓపెన్‌గా మాట్లాడండి

పిల్లలతో మాట్లాడటం వల్ల వారి ఆలోచనా సామర్థ్యం, అవగాహన పెరుగుతాయి. ప్రతిరోజూ ఫోన్, టీవీ లేకుండా కొంతసేపు మాట్లాడండి. స్కూల్‌లో పాఠాల, స్పోర్ట్స్, వారి మనోభావాలు, రోజువారీ అనుభవాల గురించి అడగండి. ఇలా మాట్లాడటం వల్ల భాషా నైపుణ్యం పెరుగుతుంది. పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడంలో ఆత్మవిశ్వాసం పొందుతారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య నమ్మకం పెరుగుతుంది.

ప్రతిరోజూ కథలు చెప్పడం అలవాటు చేసుకోండి

Advertisement

తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు కథలు చెప్పడం మంచి అలవాటు. పిల్లలు కథలు వింటూ అందులో పాత్రలు, పరిస్థితులను ఊహించుకుంటారు. ఇలా క్రమంగా వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. దీంతో పాటు వారి మనోభావాలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. నిద్రపోయే ముందు ప్రతిరోజూ కథ చెప్పండి లేదా చదవండి. ఆసక్తికరమైన కథలు క్రియేటివిటీని పెంచుతాయి. కథల ద్వారా నైతిక విలువలు కూడా నేర్చుకుంటారు. భావాలతో కథ చెప్పడం వల్ల పిల్లలు ఆనందిస్తారు. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య భావోద్వేగ సంబంధాన్ని బలపరుస్తుంది.

పిల్లల్లో క్రియేటివ్ యాక్టివిటీస్ ప్రోత్సహించండి

డ్రాయింగ్, పెయింటింగ్, పజిల్స్, క్రాఫ్ట్ వంటి యాక్టివిటీస్ సమస్యలను పరిష్కరించడం, స్వతంత్ర ఆలోచనను పెంచుతాయి. పిల్లలు ఓర్పు, ఏకాగ్రత నేర్చుకుంటారు. ప్రయత్నాన్ని అభినందించండి, పర్ఫెక్ట్‌గా ఉండాలని ఒత్తిడి చేయకండి. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

గేమ్స్, ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్ ద్వారా నేర్పండి

Advertisement

పిల్లలు ఆడుకుంటూ త్వరగా నేర్చుకుంటారు. ఆటలు ఆడిస్తూ పిల్లలకు సంఖ్యలు, రంగులు, అక్షరాలు నేర్పండి. ఆటలతో నేర్చుకోవడం వల్ల బోర్ కొట్టదు. ఇది మెదడును చురుకుగా ఉంచి.. ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది.

ప్రతిరోజూ శారీరక వ్యాయామాలు చేయించండి

ఇంట్లో గేమ్స్ కంటే బయట ప్లేగ్రౌండ్‌లో ఆటలు ఆడటం పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మొబైల్, టీవీ చూసే సమయాన్ని పరిమితం చేయండి. శారీరక కార్యకలాపాలు సామాజిక నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తాయి.

ఆరోగ్యకరమైన రోజువారీ రొటీన్ ఏర్పాటు చేయండి

నిశ్చిత సమయంలో నిద్ర, నిద్రలేపడం, భోజనం చేయడం వల్ల క్రమశిక్షణ వస్తుంది. మంచి నిద్ర ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతుంది. ఇలాంటి రొటీన్ పిల్లలకు జీవితాంతం ఉపయోగపడుతుంది.

Also Read: మీ ముందు నవ్వుతూ వెన్నుపోటు పొడిచే స్నేహితులు వీరే.. నమ్మకద్రోహులను ఇలా గుర్తించండి

పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకండి

అధిక విద్యా ఒత్తిడి పిల్లల్లో స్ట్రెస్ పెంచుతుంది. ఆటలు, విశ్రాంతి, ఫ్రీ టైం కూడా అవసరం. పిల్లలు భావోద్వేగంగా సురక్షితంగా, విలువైనవారిగా ఫీల్ అయ్యేలా చూడాలి.

Related News

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

Big Stories

Advertisement
×