Shoaib Akhtar: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య ఇవాల్టితో తొలి టెస్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో సొంత గడ్డపై పాకిస్తాన్ పై చారిత్రాత్మక టెస్ట్ విజయం సాధించిన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. అయితే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఇందులో భాగంగానే , పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) కూడా హాట్ కామెంట్స్ చేశారు. పసికూన బంగ్లాదేశ్ పైన గెలవలేని, టీమిండియా లాంటి బలమైన జట్టు ను ఎదుర్కొంటుందా ? అని ప్రశ్నించారు. అరి వీర భయంకరమైన టీమిండియాను తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కాదని బాంబు పేల్చారు. ఇలాంటి చెత్త ప్రదర్శనతో ఛాంపియన్స్ కాలేరని మండిపడ్డారు. అన్ని విభాగాల్లో పాకిస్తాన్ విఫలమైందని నిప్పులు చెరిగాడు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఒకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL2026 ) కొనసాగుతుండగా… మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Ban VS PAK) మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ జరిగింది. ఇవాల్టి వరకు కొనసాగిన ఈ టెస్టులో… అఖండ విజయం నమోదు చేసుకుంది బంగ్లాదేశ్. తన టెస్ట్ హిస్టరీలో అరుదైన విక్టరీ సాధించింది. అయితే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లయితే.. పాకిస్తాన్ జట్టును ఓడించేందుకు కుట్రలు పన్నారని బాంబు పేల్చాడు.
ఢాకా పిచ్ లో చిప్ సెట్స్ పెట్టారని, అందుకే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఈజీగా ఓడిపోయిందని ఆరోపణలు చేశాడు. ఇదంతా చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరు కూడా సరిగ్గా ఆడలేదని మండిపడ్డారు. ఒక్కరు కూడా ఫోకస్ చేయలేక విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి జట్టుతో ముందుకు వెళ్లడం కష్టమన్నారు. ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ పైన వేటు వేయాలని డిమాండ్ చేశారు. పసికూన బంగ్లాదేశ్ పైన గెలవలేని పాకిస్తాన్… భయంకరమైన టీమ్ ఇండియాను తట్టుకోవడం కష్టమేనని హెచ్చరించారు. టీం ఇండియాను గెలిచేలా జట్టును తయారు చేయాలని కోరారు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
https://www.facebook.com/photo/?fbid=1002011616072914&set=a.808612632079481