E-Paper
Advertisement

కిచెన్‌లో మరకలు, దుర్వాసన సమస్య.. ఈ చిట్కాలతో శ్రమలేకుండా క్షణాల్లో అంతా క్లీన్

కిచెన్‌లో మరకలు, దుర్వాసన సమస్య.. ఈ చిట్కాలతో శ్రమలేకుండా క్షణాల్లో అంతా క్లీన్
Advertisement

Sweet Lime Peels| వేసవి కాలం వచ్చేసింది. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు నిమ్మ, ఆరెంజ్, బత్తాయి పండ్లు అందరూ తింటుంటారు. ఈ పండ్ల తొక్కలను చాలా మంది వ్యర్థంగా పారేస్తారు. కానీ వీటితో చాలా లాభాతున్నాయి. వీటిలో ముఖ్యంగా బత్తాయి (మౌసంబి) తొక్కలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఇంటి శుభ్రతకు కూడా చాలా ఉపయోగపడతాయి. కిచెన్ లో దుర్వాసన, మరకలను సులభంగా క్లీన్ చేస్తాయి. ఇది సహజమైన, సురక్షితమైన, ఖర్చు తక్కువ ఉండే పద్ధతి.

బత్తాయి తొక్కలు చాలా ఉపయోగకరం

బత్తాయి తొక్కలో సహజంగానే నూనె, సువాసన ఉంటాయి. ఇవి దుర్వాసనలను తొలగించి, గాలిలో సువాసనతో మూడ్ రీఫ్రెష్ చేస్తాయి. ఇవి సహజ డియోడరైజర్‌గా పని చేస్తాయి. బత్తాయి తొక్కలు ఉపయోగించడం వల్ల ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, పైగా ఇవి పర్యావరణానికి ఇవి ఏమాత్రం హానికరం కాదు. అంతేకాదు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి.

ఓవెన్‌లో దుర్వాసన ఎందుకు వస్తుంది?

Advertisement

ఓవెన్‌లో ఆహారం వేడి చేసే సమయంలో అందులో జారి పడిపోవడం, కాలిపోయిన ఆహార వ్యర్థాలు, నూనె, మసాలాలు అంటుకోవడం వల్ల దుర్వాసన వస్తుంది. సరిగ్గా శుభ్రం చేయకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. చిన్న చిన్న ఆహార వ్యర్థాలు లోపలే మూలాల్లో ఉండి దుర్వాసన వ్యాప్తి చేస్తాయి.

బత్తాయి తొక్కలతో ఓవెన్ శుభ్రం చేయడం ఎలా?

బత్తాయి తొక్కలతో క్లీనింగ్ చేయాలంటే స్టీమ్ పద్ధతి ఉపయోగించాలి. మైక్రోవేవ్‌లోనే సేఫ్ గిన్నెలో నీళ్లు పోసి, తాజా బత్తాయి తొక్కలు వేయండి. ఈ గిన్నె ఓవెన్ లోపల ఉంచి సుమారు ఐదు నిమిషాలు వేడి చేయండి. ఆవిరి లోపల అన్ని మూలాలకు వ్యాపించి, మురికిని వదులుస్తుంది దుర్వాసనను తొలగిస్తుంది. తర్వాత జాగ్రత్తగా గిన్నె తీసి, ఒక శుభ్రమైన గుడ్డతో లోపలి భాగాన్ని తుడవండి. అంతా ఫ్రెష్‌గా సువాసన వస్తుంది.

మరకలను తొలగించడానికి తొక్కలు ఎలా ఉపయోగించాలి?

Advertisement

ఓవెన్‌ పై మరకలు ఉంటే బత్తాయి తొక్కను నేరుగా ఉపయోగించండి. బత్తాయి తొక్కలు మెత్తగా చేసి వాటిని ఓవెన్‌పై ఉన్న మరకలపై రాస్తే తొక్కలోని సహజ నూనెలు మురికిని లూజ్ చేస్తాయి. దీంతో ఓవెన్ ఉపరితలం మెరిసిపోతుంది. ఈ పద్ధతి చాలా సురక్షితం, ఓవెన్‌కు ఎటువంటి హాని జరగదు.

బత్తాయి తొక్కలను ఫ్రెషనర్‌గా ఉపయోగించడం

తొక్కలను ఎండబెట్టిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. ఎండిన తొక్కలు సహజ గాలి ఫ్రెషనర్‌గా పని చేస్తాయి. వాటిని ఓవెన్ లోపల లేదా వంటింట్లో ఉంచండి. దీని వల్ల ఎక్కువ సేపు తాజా వాసన ఉంటుంది.

Also Read:  మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

ఓవెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి

ఓవెన్ శుభ్రం చేసేటప్పుడు ముందు ఆఫ్ చేసి, పూర్తిగా చల్లబడే వరకు వేచి ఉండండి. తడి గుడ్డతో తుడవండి కానీ ఎక్కువ నీళ్లు పోయకండి. ఎక్కువ మురికి ఉంటే సహజ శుభ్రపరిచే పదార్థాలు ఉపయోగించండి. తొక్కలను ఎండబెట్టి పొడి చేసి పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. వారానికి ఒకసారి ఓవెన్ శుభ్రం చేయడం మంచిది.

బత్తాయి తొక్కలు ఇంటి శుభ్రతకు చాలా ఉపయోగకరం. ఇవి సహజంగా వాసనలను తొలగించి, వంటింటిని ఫ్రెష్‌గా ఉంచుతాయి. ఈ పద్ధతి సులభం, సురక్షితం, డబ్బు ఆదా చేస్తుంది. తొక్కలను వ్యర్థం చేయకుండా తెలివిగా ఉపయోగించండి. సహజమైన చిట్కాలతో మీ వంటింటిని ఎప్పుడూ తాజాగా ఉంచండి.

 

Related News

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

Big Stories

Advertisement
×