E-Paper
Advertisement

గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఈ ‘వార్నింగ్’ మీ కోసమే..

గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఈ ‘వార్నింగ్’ మీ కోసమే..
Advertisement

Gas Saving: అసలే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పుడు బుక్ చేసిన గ్యాస్ ఎప్పటికి వస్తుందో తెలీదు.ఇలాంటి టైమ్ లో ఉన్న గ్యాస్‌ను చాలా పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది.మరి మీ సిలిండర్‌ను మరో వారం రోజుల పాటు ఎక్స్ ట్రాగా ఎలా వాడుకోవాలో ఈ క్రేజీ టిప్స్ తో మీరే తెలుసుకోండి.

ఒక తడి గుడ్డను సిలిండర్ చుట్టూ 2 నిమిషాలు

Advertisement

మొదటగా మీ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..ఒక తడి గుడ్డను సిలిండర్ చుట్టూ 2 నిమిషాలు చుట్టి తీసేయండి. ఏ భాగం అయితే త్వరగా  ఆరిపోతుందో అక్కడ గ్యాస్ ఖాళీ అయిందని, ఎక్కడైతే ఇంకా తడిగా ఉందో అక్కడ గ్యాస్ నిండుగా ఉందని అర్థం. దీనివల్ల వంట మధ్యలో గ్యాస్ అయిపోయి  హడావిడి పడకుండా ముందే ప్లాన్ చేసుకోవచ్చు.

ఇలా చేస్తే గ్యాస్ చాలా ఆదా

Advertisement

ఇక చాలామంది వంట త్వరగా అవ్వాలని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.అలా చేస్తే కేవలం గిన్నె చుట్టూ వేడిని వృథా చేస్తుంది తప్ప వంటను స్పీడప్ చేయదు.సో ఎప్పుడు చేసిన లో ఫ్లేమ్ లేదా మీడియం ప్లేమ్ లోవంట చేయండి.ఇలా చేస్తే గ్యాస్ చాలా ఆదా అవుతుంది కూడా.ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ మంట ఎంత తక్కువ ఉంటే, మీ సిలిండర్ అంత ఎక్కువ రోజులు వస్తుందని.

also read:ఎర్రటి మిరపకాయలు ఏడాది కాలం రంగు, రుచి మారకూడదా?

స్టవ్ బర్నర్ రంధ్రాలు నూనె జిడ్డుతో


ఇక అన్నింటి కన్నా ముఖ్యమైంది మీ గ్యాస్ స్టవ్ బర్నర్ రంధ్రాలు నూనె జిడ్డుతో లేదా దుమ్ముతో నిండిపోయాయేమో చెక్ చేయండి. అలా ఉంటె మాత్రం మీ గ్యాస్ వేస్టేజ్ అవుతున్నట్టే.మంట బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ లో వస్తుంటే వెంటనే బర్నర్ క్లీన్ చేయండి. క్లీన్ గా ఉన్న బర్నర్ వల్ల గ్యాస్ వేస్టేజ్ కాకుండా పర్ఫెక్ట్ గా మండుతుంది.

మూత పెట్టడం ఒక గోల్డెన్ రూల్

ఇక వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టడం ఒక గోల్డెన్ రూల్ అని మర్చిపోకండి.ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటే ఆహారం 30% త్వరగా ఉడుకుతుంది. ఇలా చేస్తే  కేవలం సమయాన్ని మాత్రమే కాదండోయ్ ..మీ సిలిండర్‌ను కూడా పొదుపు చేసినట్టే.

అలాంటప్పుడు సిలిండర్‌ను పక్కన పడేయకండి 

 ఇక సిలిండర్ అయిపోవడానికి వచ్చినప్పుడు మంట చిన్నగా వస్తుందన్న సంగతి తెల్సిందే.అలాంటప్పుడు సిలిండర్‌ను పక్కన పడేయకుండా, ఒక పెద్ద బకెట్ వేడి నీళ్లలో దాన్ని ఉంచండి. అలా చేస్తే లోపల ఉన్న గ్యాస్ అంతా పైకి వచ్చి, మీరు కనీసం మరో రెండు మూడు పూటలు హ్యాపీగా వంట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.సో ఇకనుండి ఈ చిన్న చిన్న టిప్స్  పాటిస్తే మీ నెల రోజుల సిలిండర్ మరో వారం రోజులు ఎక్స్ట్రా గా రావడం ఖాయం.

also read:ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క ట్యాప్‌తో పని ఖతమ్!

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×