E-Paper
Advertisement

నిద్రలేమితో బాధపడుతున్నారా ? 5 నిమిషాల్లో నిద్రపోయే ఈ టెక్నిక్స్ ట్రై చేయండి

నిద్రలేమితో బాధపడుతున్నారా ? 5 నిమిషాల్లో నిద్రపోయే ఈ టెక్నిక్స్ ట్రై చేయండి
Advertisement

How To Sleep Fast: రోజంతా కష్టపడి నిద్రపోదామనే సమయానికి గంటల తరబడి నిద్ర రాక అటు ఇటు దొర్లుతున్నారా? స్మార్ట్‌ఫోన్ వాడకం, పని ఒత్తిడి , మానసిక ఆందోళనల వల్ల ‘ఇన్సోమ్నియా’ (నిద్రలేమి) బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిద్ర సరిగ్గా లేకపోతే అది గుండె జబ్బులు, మధుమేహం ,మానసిక వ్యాధులకు దారితీస్తుంది. అయితే.. కేవలం 5 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో.. నిద్రపోయేలా చేసే కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమితో బాధపడుతున్నారా? 5 నిమిషాల్లో నిద్రపోయే అద్భుతమైన టెక్నిక్స్:

Advertisement

నిద్ర అనేది మన శరీరానికి రీఛార్జ్ లాంటిది. నిద్ర రాకపోవడానికి ప్రధాన కారణం మన మెదడు , శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లకపోవడమే.. వేగంగా నిద్రపోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి అవేంటంటే..

1. మిలిటరీ మెథడ్:
ఈ పద్ధతిని అమెరికన్ నేవీ ప్రీ-ఫ్లైట్ స్కూల్ అభివృద్ధి చేసింది. యుద్ధ భూమిలో కూడా సైనికులు కేవలం 2 నిమిషాల్లో నిద్ర పోవడానికి దీనిని ఉపయోగిస్తారు.

Advertisement

ఎలా చేయాలి?
1. ముందుగా మీ ముఖంలోని కండరాలను (నవ్వుతున్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు వాడే కండరాలు) పూర్తిగా వదిలేయండి.
2. భుజాలను వీలైనంత కిందికి వాల్చి, చేతులను పక్కన వేయండి.
3. గాలిని నెమ్మదిగా వదులుతూ ఛాతిని రిలాక్స్ చేయండి.
4. కాళ్లు, మోకాళ్లు, పాదాలను వదులుగా ఉంచండి.
5. పది సెకన్ల పాటు మెదడును ఖాళీగా ఉంచండి. ఏదైనా ఆలోచన వస్తే “ఆలోచించకు.. ఆలోచించకు..” అని మనసులో అనుకోండి.
ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించినా.. 6 వారాల ప్రాక్టీస్ తర్వాత 96% మందికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

2. 4-7-8 శ్వాస ప్రక్రియ :
ఇది యోగాలోని ప్రాణాయామం ఆధారంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది మన నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.

పద్ధతి:
4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకోండి.

7 సెకన్ల పాటు గాలిని లోపలే బిగబట్టి ఉంచండి.

8 సెకన్ల పాటు నోటి ద్వారా గాలిని ‘హుష్’ అనే శబ్దంతో నెమ్మదిగా వదలండి.

ఇలా నాలుగు సార్లు చేస్తే మీ గుండె వేగం తగ్గి.. శరీరం నిద్రకు సిద్ధమవుతుంది.

3. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్:
శరీరంలోని ప్రతి కండరాన్ని క్రమ పద్ధతిలో బిగించి వదలడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పాదాల వేళ్ల నుంచి మొదలుపెట్టి నుదురు వరకు ఉన్న ప్రతి కండరాన్ని 5 సెకన్ల పాటు గట్టిగా బిగబట్టి, ఆపై ఒక్కసారిగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి మాయమై నిద్ర ముంచుకొస్తుంది.

4. పారాడాక్సికల్ ఇంటెన్షన్ :
ఇది ఒక వింతైన కానీ పనిచేసే పద్ధతి. నిద్రపోవాలని ప్రయత్నించే బదులు, “నేను నిద్రపోకూడదు.. కళ్లు తెరిచే ఉంచాలి” అని మీకు మీరు చెప్పుకోవాలి. నిద్రపోవాలనే ఆందోళన తగ్గినప్పుడు, మెదడు సహజంగానే నిద్రలోకి జారుకుంటుంది.

Also Read: ఆరోగ్యానికి మంచిదే కదా.. అని అల్లం టీ తాగుతున్నారా ?

మంచి నిద్ర కోసం కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు:
స్క్రీన్ టైమ్: పడుకోవడానికి గంట ముందు మొబైల్, టీవీలను పక్కన పెట్టండి. వీటి నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది.

కాఫీ/టీ: సాయంత్రం 6 గంటల తర్వాత కెఫీన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవద్దు.

వాతావరణం: గది చీకటిగా.. చల్లగా (సుమారు 18-20°C) ఉండేలా చూసుకోండి.

నిద్ర లేమి అనేది కేవలం శారీరక సమస్యే కాదు.. అది మీ జీవన ప్రమాణాన్ని తగ్గిస్తుంది. పైన పేర్కొన్న మిలిటరీ మెథడ్ లేదా 4-7-8 టెక్నిక్‌ను క్రమం తప్పకుండా పాటిస్తే.. మీ మెదడుకు వేగంగా నిద్రపోయే శిక్షణ లభిస్తుంది. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర పట్టకపోతే.. అది తీవ్రమైన ఆరోగ్య సమస్యల  వల్ల కావచ్చు, అప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అత్యవసరం.

Related News

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×