E-Paper
Advertisement

Sweet Guava: మార్కెట్‌లో తియ్యటి, తాజా జామపండ్లను గుర్తించలేకపోతున్నారా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే !

Sweet Guava: మార్కెట్‌లో తియ్యటి, తాజా జామపండ్లను గుర్తించలేకపోతున్నారా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే !
Advertisement

Sweet Guava: జామ ఎంతో రుచికరమైన, పోషక విలువలు ఉన్న పండు. దీనిలోని విటమిన్ C, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. కొన్నిసార్లు పండు చూడ్డానికి బాగున్నా, లోపల పుల్లగా లేదా రుచి లేకుండా ఉండొచ్చు. ప్రతిసారీ తియ్యగా, మంచి రుచి ఉన్న జామపండును ఎంచుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు, పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. రంగును గమనించండి:

జామపండు పూర్తిగా పండినప్పుడు. దాని రంగు మారుతుంది. ఎక్కువ తియ్యగా, పండిన జామపండు సాధారణంగా లేత పసుపుపచ్చ రంగులో లేదా ఆకుపచ్చ, పసుపు రంగుల మిశ్రమంగా ఉంటుంది. దీని అర్థం పండు కోసిన తర్వాత పూర్తిగా పండింది అని. అలా కాకుండా పండు గట్టిగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే.. అది పూర్తిగా పండలేదని, ఇంకా పక్వానికి రాలేదని అర్థం. ఇలాంటి పండును కొంటే.. అది పండడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల జామ కాయలు పండినా కూడా కొద్దిగా ఆకు పచ్చగానే ఉంటాయి. కాబట్టి కేవలం రంగుతో పాటు.. మిగతా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Advertisement

2. వాసన చూడండి:

పండు ఎంత తియ్యగా, రుచిగా ఉందో తెలుసుకోవడానికి స్మెల్ చాలా ముఖ్యమైంది. మంచిగా పండిన జామపండు నుంచి కొద్దిగా తియ్యటి, మాధుర్య మైన సువాసన వస్తుంది. మీరు పండును ముక్కు దగ్గర పెట్టి చూసినప్పుడు, ఆ సువాసన వెంటనే మీకు తెలియాలి. అసలు వాసనే లేకపోతే.. అది పండ లేదని లేదా లోపల పచ్చిగా ఉందని అర్థం. అలా కాకుండా పులిసి పోయిన వాసన వస్తే, పండు ఎక్కువగా పండి, చెడి పోయే దశకు వచ్చిందని అర్థం.

3. స్పర్శ ద్వారా తెలుసుకోండి:

పండును చేతిలోకి తీసుకుని.. దాని గట్టిదనం ద్వారా పక్వాన్ని అంచనా వేయవచ్చు. తియ్యటి జామ పండు కొద్దిగా మృదువుగా అనిపిస్తుంది. అర చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కినప్పుడు.. వేలు లోపలికి వెళ్లకుండా.. కొద్దిగా ఒత్తిడికి లొంగితే అది తినడానికి సరైన దశలో ఉందని అర్థం. పండు చాలా గట్టిగా ఉంటే.. అది పచ్చిగా ఉందని ఇంకా పండడానికి సమయం పడుతుందని అర్థం. ఇలా కాకుండా పండు బాగా మెత్తగా ఉంటే, అది ఎక్కువగా పండి, మెత్త బడి, లోపల చెడి పోయే దశలో ఉందని అర్థం.

Also Read: ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన నీరు తాగితే.. బోలెడు లాభాలు !

4. ఉపరితలం :

జామ పండు ఉపరితలాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పండుపై నలుపు మచ్చలు, రంధ్రాలు లేదా చిన్న గాయాలు ఉంటే.. ఆ భాగంలో పండు పాడైపోయే అవకాశం ఉంది లేదా కీటకాల దాడికి గురై ఉండవచ్చు. వీలైనంత వరకు మచ్చలు లేని పండును ఎంచుకోండి.మంచి, ఆరోగ్య కరమైన జామ పండుపై సహజ మైన మెరుపు ఉంటుంది.

ఈ నాలుగు ప్రధాన అంశాలను పరిగణన లోకి తీసుకుంటే..  ప్రతిసారీ ఉత్తమమైన, తియ్యటి జామ పండును ఎంచుకోచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×