Suresh Raina: భారత టెస్ట్ క్రికెట్ జట్టు ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతుంది. జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ని 3-0 తో ఓడిపోవడం, ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని మొదటి టెస్ట్ లో కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఇబ్బంది పడడం, రెండవ టెస్ట్ లోను పేలవ ప్రదర్శనలతో భారత జట్టు చెత్త ప్రదర్శన పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
Also Read: Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొలగించాల్సిందే… మా కెరీర్లు సంకనాకిపోతున్నాయి !
జట్టులో పేరుకే తోపు ప్లేయర్లు.. కానీ అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా సరిగా ఆడటం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో టీమ్ ఇండియా మేనేజ్మెంట్, బీసీసీఐ పై తీవ్ర స్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి.
గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఆయన పై విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటు ఇంటా, అటు బయట కూడా భారత జట్టుకు ఎక్కువగా ఓటములే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు సగటు 30 మార్క్ దాటలేకపోతున్నారు. 300 పరుగులకు పైగా స్కోర్ చేయడం అరుదుగా మారింది. ప్రస్తుతం గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్.. భారత్ లో జరుగుతుందా..? లేక సౌత్ ఆఫ్రికా గడ్డపై జరుగుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత జట్టుకు ఈ పరిస్థితి దాపరించిందని అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు అయిన అజింక్యా రహానే, కరుణ్ నాయర్, సర్పరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరణ్ తో పాటు మహమ్మద్ షమీని విస్మరించడం భారత జట్టుకు నష్టం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ జట్టును నాశనం చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా అతడిని హెడ్ కోచ్ బాధ్యతలనుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ని టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. గంభీర్ కి మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. గంభీర్ పై వస్తున్న విమర్శలను ఉద్దేశించి సురేష్ రైనా మాట్లాడుతూ.. ” గౌతమ్ గంభీర్ కోచ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. భారత జట్టు ఓ సంవత్సరం క్రితం ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. అలాగే టి-20 వరల్డ్ కప్ కూడా సొంతం చేసుకుంది. ఇటీవల ఆసియా కప్ 2025 లోను విజేతగా నిలిచింది. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోనే ఈ విజయాలు దక్కాయి.
Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?
కోచ్ అనే వ్యక్తి ఆటగాళ్లకు దిశా నిర్దేశం మాత్రమే చేయగలడు. బ్యాటర్లే పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లు గెలుపుపై విశ్వాసం కోల్పోవద్దు. నేను క్రికెట్ ఆడిన రోజులలో.. ఒకవేళ సిరీస్ లో వెనకబడి ఉంటే.. తిరిగి తప్పకుండా పుంజుకుంటాం అనే గట్టి నమ్మకంతో ముందుకు సాగే వాళ్ళం. బ్యాటింగ్ లో భాగస్వామ్యాలు నెలకొల్పడం పైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్లకు ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి. అందువల్ల వారు దేశవాళీ క్రికెట్ ఆడాలి. రహనే, పుజార దేశవాళీ మ్యాచ్ లలో ఆడి తమ ఫామ్ ని కాపాడుకునేవారు. దేశవాళీల్లో ఆడడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది” అని చెప్పుకొచ్చాడు సురేష్ రైనా.