E-Paper
Advertisement

How To Improve Digestion: మందులు లేకుండానే మలబద్ధకం నుంచి ఉపశమనం.. ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!

How To Improve Digestion: మందులు లేకుండానే మలబద్ధకం నుంచి ఉపశమనం.. ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!
Advertisement

How To Improve Digestion: మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నాం అన్నదాని కంటే.. ఆ ఆహారం మన శరీరానికి ఎంత బాగా వంటబట్టింది అన్నదే ముఖ్యం. దీనినే జీర్ణ క్రియ అంటారు. ప్రస్తుతం జంక్ ఫుడ్, సమయానికి భోజనం చేయక పోవడం, తక్కువ నీరు తాగడం వల్ల చాలా ది గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మందుల కంటే.. మన ఇంట్లోనే సహజమైన చిట్కాలతో జీర్ణ శక్తిని ఎలా పెంచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.

ఈ టిప్స్‌తో జీర్ణ సమస్యలకు చెక్:
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యానికి పునాది మన జీర్ణవ్యవస్థ. జీర్ణ క్రియ సక్రమంగా లేకపోతే.. అది కేవలం కడుపు నొప్పికి మాత్రమే పరిమితం కాదు.. చర్మ సమస్యలు, నీరసం ,ఊబకాయానికి కూడా దారి స్తుంది. మరి మీ జీర్ణక్రియను మెరుగు పరచుకోవడానికి కొన్ని చిట్కాలు చాలా బాగా ఉపయోగ పడతాయి.

Advertisement

1. ఆహారాన్ని బాగా నమిలి తినండి:
జీర్ణ క్రియ అనేది మీ నోటి నుంచే మొదలవుతుంది. మనం ఆహారాన్ని ఎంత బాగా నమిలితే.. అంత ఎక్కువగా లాలా జలం ఆహారంతో కలుస్తుంది. లాలా జలంలో ఉండే ఎంజైమ్‌‌లు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో సహాయ పడతాయి. కాబట్టి హడావిడిగా మింగేయకుండా.. ప్రశాంతంగా కూర్చుని నమిలి తినడం అలవాటు చేసుకోండి.

2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
పీచు పదార్థం మన పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా అరటి పండు, ఆపిల్, ఆకు కూరలు రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Advertisement

3. తగినంత నీరు తాగడం:
శరీరంలో తగినంత నీరు లేకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. నీరు ఆహారం సులభంగా ముందుకు కదలడానికి సహాయ పడుతుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. అయితే.. భోజనం చేస్తున్నప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. తిన్న అరగంట తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది.

4. వంటింటి చిట్కాలు:
మన వంటిల్లు ఒక చిన్న హాస్పిటల్ లాంటిది. వంటింటిలోని ఎన్నో పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అల్లం : అల్లం టీ లేదా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల గ్యాస్, వికారం తగ్గుతాయి.

వాము : అజీర్తిగా ఉన్నప్పుడు కొద్దిగా వాము, ఉప్పు కలిపి తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జీలకర్ర : జీల కర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది.

పెరుగు/మజ్జిగ: పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also Read: మీరు సరిగ్గా నిద్రపోకపోవడానికి కారణం.. ఈ సమస్యలే!

5. వ్యాయామం, వాకింగ్:
భోజనం చేసిన వెంటనే.. పడుకోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. రోజూ క్రమం తప్పకుండా చేసే యోగాసనాలు (వజ్రాసనం వంటివి) జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తాయి.

6. ప్రాసెస్ చేసిన ఆహారం:
మైదా, అధిక చక్కెర, నూనెలో.. వేయించిన పదార్థాలు, కూల్ డ్రింక్స్ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతే కాకుండా కడుపులో.. మంటను కలిగిస్తాయి.

జీర్ణక్రియ మెరుగు పడటం అనేది ఒక రాత్రిలో జరిగే మార్పు కాదు. పైన చెప్పిన చిట్కాలను మీ లైఫ్ స్టైల్‌లో భాగంగా చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే మీకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×