E-Paper
Advertisement

Sleep Disorders: మీరు సరిగ్గా నిద్రపోకపోవడానికి కారణం.. ఈ సమస్యలే!

Sleep Disorders: మీరు సరిగ్గా నిద్రపోకపోవడానికి కారణం.. ఈ సమస్యలే!
Advertisement

Sleep Disorders: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ చాలా మంది రాత్రి పూట నిద్రపోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. లేదా నిద్రలో అసాధారణ ప్రవర్తనను కలిగి ఉంటారు. దీనినే ‘స్లీప్ డిజార్డర్’ లేదా నిద్ర రుగ్మత అంటారు. ఇది కేవలం అలసటకే పరిమితం కాకుండా.. గుండె జబ్బులు, ఒత్తిడి , మానసిక సమస్యలకు దారి తీస్తుంది. అసలు ఈ నిద్ర సమస్యలు ఎన్ని రకాలు? వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

నిద్ర అనేది కేవలం కళ్లు మూసుకోవడం కాదు. అది మన అవయవాలు రిపేర్ అయ్యే సమయం. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఏదో ఒక రకమైన నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వందకు పైగా నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ.. వాటిలో అత్యంత సాధారణమైన 5 రకాలు ఉన్నాయి.

Advertisement

1. ఇన్సోమ్నియా (Insomnia – నిద్రలేమి)
ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సాధారణమైన సమస్య. ఇందులో వ్యక్తికి నిద్ర పట్టడం చాలా కష్టమవుతుంది. లేదా పడుకున్నా మధ్యలో మెలకువ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడం అసాధ్యంగా మారుతుంది.

లక్షణాలు: రాత్రంతా దొర్లడం, ఉదయం లేవగానే చిరాకుగా ఉండడం, పగటి పూట నిద్రమత్తుగా అనిపించడం.

Advertisement

కారణాలు: పని ఒత్తిడి, ఆందోళన, కెఫిన్ (కాఫీ/టీ) ఎక్కువగా తీసుకోవడం లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ చూడటం.

2. స్లీప్ అప్నియా (Sleep Apnea):
ఇది అత్యంత ప్రమాదకరమైన సమస్య. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడాన్ని ‘స్లీప్ అప్నియా’ అంటారు. అంటే నిద్రలో కొన్ని క్షణాల పాటు ఊపిరి ఆగిపోతుంది.

లక్షణాలు: విపరీతమైన గురక, నిద్రలో ఒక్కసారిగా ఊపిరి ఆడక మెలకువ రావడం, గొంతు ఎండిపోవడం.

ప్రమాదం: దీనివల్ల హైబీపీ, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.

3. నార్కోలెప్సీ (Narcolepsy):
దీనిని ‘నిద్ర దాడి’ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్న వారు పగటి పూట ఎక్కడైనా, ఎప్పుడైనా అకస్మాత్తుగా నిద్ర పోతారు. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కూడా వీరు నిద్రలోకి జారుకుంటారు.

లక్షణాలు: పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, కండరాల బలహీనత, నిద్రలో పక్షవాతం వచ్చినట్లు అనిపించడం.

4. రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ ( RLS):
పడుకున్నప్పుడు కాళ్ళలో ఏదో పాకుతున్నట్లు లేదా తిమ్మిర్లు వస్తున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల కాళ్ళను నిరంతరం కదిలించాలనే కోరిక కలుగుతుంది. ఇది నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

లక్షణాలు: కాళ్ళలో అసౌకర్యం, కాళ్ళను కదిలిస్తేనే.. ఉపశమనం లభించడం. ఇది ఎక్కువగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లోనే జరుగుతుంది.

5. పారాసోమ్నియాస్ (Parasomnias):
నిద్రలో అసాధారణ ప్రవర్తనలను ‘పారాసోమ్నియా’ అంటారు. ఇందులో నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడటం లేదా పీడకలలు రావడం వంటివి ఉంటాయి.

లక్షణాలు: నిద్రలో లేచి అటు ఇటు నడవడం , భయంకరమైన కలలు రావడం, నిద్రలో భయపడి కేకలు వేయడం.

Also Read: ఓట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? సైన్స్ చెబుతున్న అసలు నిజాలివే!

నిద్ర సమస్యలకు పరిష్కారాలు :
క్రమశిక్షణ: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

స్క్రీన్ టైమ్ తగ్గించండి: పడుకోవడానికి గంట ముందే మొబైల్, టీవీలకు దూరంగా ఉండండి.

వాతావరణం: పడుకునే గది చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి.

పైన పేర్కొన్న లక్షణాలు మీలో తీవ్రంగా ఉంటే.. వెంటనే ‘స్లీప్ స్పెషలిస్ట్’ను కలవడం మంచిది.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×