E-Paper
Advertisement

ఆఫీసులో అందరి ముందు మీ ఇమేజ్ పెంచుకోవడమెలా? కెరీర్‌లో త్వరగా విజయం సాధించడానికి ఇలా చేయండి

ఆఫీసులో అందరి ముందు మీ ఇమేజ్ పెంచుకోవడమెలా? కెరీర్‌లో త్వరగా విజయం సాధించడానికి ఇలా చేయండి
Advertisement

work personality tips| ఆఫీసులో మీరు కొత్తగా ఉద్యోగానికి వెళ్లినప్పుడు మీ సహోద్యోగులు, మీ బాస్.. అందరూ మీ వ్యక్తిత్వం గురించి త్వరగా అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. మీ ప్రవర్తన, వైఖరి, సంభాషణ మీ గురించి వారిలో ఈ అభిప్రాయం రూపొందిస్తాయి. మీ గురించి ఒక బలమైన ఇంప్రెషన్ మిమ్మల్ని కెరీర్‌లో వేగంగా ఎదగడానికి సహాయపడుతుంది. మీరు వృత్తిపరమైన జీవితంలో మీరు అలవర్చుకునే చిన్న చిన్న అలవాట్లు ఇతరులపై పెద్ద ప్రభావాన్ని సృష్టించగలవు.

ఆఫీసులో మీ ఇంప్రెషన్ చాలా ముఖ్యం

పని చేసే ప్రదేశాల్లో ఇతరులని మీరు ఇంప్రెస్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఇంప్రెషన్ వల్లే ఇతరులు మీతో ఎలా ప్రవర్తిస్తారో నిర్ణయిస్తుంది. దీనివల్ల ప్రమోషన్, నమ్మకం, టీమ్ ఎఫర్ట్ కోసం సహాయపడుతుంది. ఈ సానుకూల ఇంప్రెషన్ మీ పట్ల గౌరవాన్ని, విశ్వసనీయతను పెంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారందరూ మీరు ఏం చెప్పారో దాన్ని గుర్తుపెట్టుకోరు.. కానీ మీరు ఎలా ప్రవర్తించారో గుర్తుంచుకుంటారు. మీ ప్రవర్తనలో స్థిరత్వం ఒక శాశ్వతమైన ఇంప్రెషన్ వేస్తుంది.

మొదటి ఇంప్రెషన్ ఎందుకు ముఖ్యం?

Advertisement

మీరు ఎవరినైనా కలిసినప్పుడు ఆ తొలి పరిచయంలో ఆ మొదటి ఇంప్రెషన్ కేవలం కొన్ని సెకన్లలో ఏర్పడుతుంది. మీ రూపం, మీ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. మీరు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలి. ఇది మీలోని క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం చూపిస్తుంది. ఆఫీసులో తొలిసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు.. చిరునవ్వుతో, ఆ వ్యక్తితో నేరుగా చూస్తూ సంభాషణ కొనసాగించండి. ఇలా చేయడం వల్ల మీలోని కాన్ఫిడెన్స్, స్నేహంగా ఉండే స్వభావం కనిపిస్తుంది.

కమ్యూనికేషన్ తోనే మీ వ్యక్తిత్వానికి బలం

స్పష్టమైన సంభాషణ ఆత్మవిశ్వాసాన్ని, అవగాహనను చూపిస్తుంది. మర్యాదగా మాట్లాడండి, సంభాషణల సమయంలో జాగ్రత్తగా వినండి. ఇతరులు మాట్లాడుతుండగా మధ్యలో ఆపకండి. మీ ఆలోచనలను స్పష్టంగా వివరించడానికి సాధారణ పదాలను ఉపయోగించండి. గౌరవప్రదమైన సంభాషణ ఆఫీసులో బలమైన సంబంధాలను నిర్మిస్తుంది.

బాడీ లాంగ్వేజ్ ప్రభావం

Advertisement

మీరు మాట్లాడడమే కాదు. మీ శరీర కదలికలు, ముఖ హావభావాలు అంటే బాడీ లాంగ్వేజ్ మీ వైఖరి, ఆత్మవిశ్వాసాన్ని బయటపెడుతుంది. నిటారుగా నిలబడండి పనిచేసేటప్పుడు వంగి కూర్చోకండి. పక్కకు చూస్తూ మాట్లాడకుండా, నేరుగా చూస్తూ వివరించండి. చర్చల సమయంలో చేతులు కట్టకొని ఉండడం మంచిది కాదు. చేతులు తెరిచి ఉంచే భంగిమ మీలో ఆత్మవిశ్వాసం, ఆసక్తిని చూపిస్తుంది.

విశ్వసనీయంగా, బాధ్యతాయుతంగా ఉండాలి?

ప్రతిరోజూ మీ పనులను సకాలంలో పూర్తి చేయండి. గడువు తేదీలను పాటించడం వృత్తి నైపుణ్యాన్ని, నిబద్ధతను చూపిస్తుంది. పనిపట్ల బాధ్యతాయుతంగా ఉండేవారిని అందరూ ఆదరిస్తారు, వారిపట్ల నమ్మకంగా ఉంటారు. అందుకే మీరు చేసే పని, తప్పులకు బాధ్యత వహించండి. ఈ లక్షణాల వల్ల సహోద్యోగులు మీ పట్ల విశ్వసనీయత, గౌరవం చూపుతారు.

సానుకూలంగా, వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలి

సానుకూల దృక్పథం ఆఫీసులో మీ ఇంప్రెషన్ మెరుగవుతుంది. ఆఫీసులో ఫిర్యాదు చేయడం లేదా ప్రతికూలత వ్యాప్తి చేయడం మానుకోండి. సమస్యలపై దృష్టి పెట్టకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి. ఒత్తిడి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండండి. వృత్తిపరమైన ప్రవర్తన పరిపక్వత, నియంత్రణను చూపిస్తుంది.

ఆఫీసులో తగిన దుస్తులు ధరించాలి

మీ దుస్తుల శైలి మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పని ప్రదేశంలో శుభ్రమైన, తగిన దుస్తులు ధరించండి. కంపెనీ డ్రెస్ కోడ్ ను సరిగ్గా పాటించండి. అతి సాధారణ లేదా స్టైలిష్ బట్టలు ధరించడం మంచిది కాదు. సాధారణ, శుభ్రమైన దుస్తులు బలమైన ఇంప్రెషన్‌ని సృష్టిస్తాయి.

బలమైన సంబంధాలను ఎలా నిర్మించుకోవాలి?

మంచి సంబంధాలు మీ పని వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. మీ సహోద్యోగుల పట్ల దయగా, సహాయకారిగా ఉండండి. జట్టు సభ్యులకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. చెడుగా మాట్లాడటం, అనవసర విభేదాలను మానుకోండి. ఎవరి హోదా ఏమైనప్పటికీ అందరినీ గౌరవించండి.

నిరంతరం నేర్చుకోవడం, మెరుగుపరచుకోవడం ఎలా?

నిరంతరం నేర్చుకోవడం వృత్తిపరంగా పెరగడానికి సహాయపడుతుంది. మీ నైపుణ్యాలు, జ్ఞానాన్ని క్రమం తప్పకుండా అప్గ్రేడ్ చేయండి. ఇతరుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. నేర్చుకోవడం అంకితభావాన్ని, మెరుగుపడే సంసిద్ధతను చూపిస్తుంది. మీ విలువను పెంచుతుంది.

సమయాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి?

సమయ నిర్వహణ మీలో క్రమశిక్షణ, ఏకాగ్రతని చూపిస్తుంది. మీ పనులను ప్రణాళిక చేసుకోండి, ప్రతిరోజూ స్పష్టమైన ప్రాధాన్యతలు నిర్దేశించుకోండి. పని సమయంలో ఆలస్యం, దృష్టి మరల్చే వాటిని మానుకోండి. గడువు తేదీలకు ముందే ముఖ్యమైన పనిని పూర్తి చేయండి. ఇది ఉత్పాదకతను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

Also Read: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? ఈ నాలుగు అలవాట్లే కారణం..

మీ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి?

భావోద్వేగ నియంత్రణ వృత్తిపరమైన జీవితంలో చాలా ముఖ్యం. కష్టమైన పరిస్థితులలో త్వరగా స్పందించకండి. మాట్లాడటానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఆలోచించండి. విభేదాల సమయంలో ప్రశాంతంగా, స్థిరంగా ఉండండి. ఈ లక్షణాలు మీలో మానసిక పరిపక్వత, ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతాయి.

దీర్ఘకాలంలో విజయం కోసం పై తెలిపిన లక్షణాలు చాలా ఉపయోగపడతాయి.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×