E-Paper
Advertisement

వైట్‌హౌస్‌‌లో కాల్పుల కలకలం.. కరస్పాండెంట్స్ డిన్నర్ ఈవెంట్, కాల్పులపై అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్

వైట్‌హౌస్‌‌లో కాల్పుల కలకలం.. కరస్పాండెంట్స్ డిన్నర్ ఈవెంట్, కాల్పులపై అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్
Advertisement

White House: అమెరికాలో ఏం జరుగుతోంది? ఇటీవల వైట్‌హౌస్ చుట్టూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? తాజాగా వైట్‌హౌస్ కాల్పుల ఘటన వెనుక ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తముంది? అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సేఫ్‌గా బయటపడ్డారా? వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఆదేశ మీడియా వెల్లడించింది.

వైట్‌హౌస్‌‌లో కాల్పుల కలకలం

Advertisement

ఇటీవల అమెరికాలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ రకరకాల ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తృటిలో తప్పించుకున్నారు.

వెంటనే అలర్టయిన సెక్యూరిటీ విభాగం ట్రంప్‌ సహా కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్‌హౌస్‌లో కరస్పాండెంట్స్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు అధ్యక్షుడు ట్రంప్‌. ఈవెంట్‌కు అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సహా కీలక నేతలు హాజరయ్యారు. డిన్నర్‌ మీటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు మోత మోగింది.

Advertisement

మీడియా మిత్రులకు డిన్నర్ ఈవెంట్, సురక్షిత ప్రాంతానికి ట్రంప్ తరలింపు

వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు.. అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తోపాటు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల సమయంలో చాలామంది అతిథులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు టేబుళ్ల కింద దాక్కున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో వణికిపోయారు.

అక్కడి నుంచి బయటపడితే చాలని కోరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలుపాలైనట్లు ఎలాంటి నివేదికలు రాలేదు. ఈ సమావేశానికి దాదాపు 2,600 మంది హాజరైనట్టు తెలుస్తోంది. చాలామంది తలదాచుకోగా, వెయిటర్లు భోజనశాల ముందు భాగానికి పారిపోయారు.  ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: H-1B వీసాలపై 3 ఏళ్ల పాటు నిషేధం.. యూస్ కాంగ్రెస్ లో బిల్లు

ట్రంప్ సురక్షిత ప్రదేశంలో సేఫ్‌గా ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని అధికారులు కోరడంతో తాను వైట్ హౌస్‌కు తిరిగి వెళ్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. కాల్పులు ఘటన సమయంలో కొన్ని అడుగుల దూరంలో ట్రంప్ ఉన్నట్లు ప్రత్యక్ష‌సాక్షి చెబుతున్నారు.

గడిచిన రెండువారాల కిందట వైట్‌హౌస్ సమీపంలోని పార్కులో కాల్పులు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే  అధ్యక్షుడు ట్రంప్ హాజరైన ఈవెంట్‌లో ఈ విధంగా జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పని చేశారన్నారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తనపై దాడి జరగడం ఇది తొలిసారి కాదని, గతంలో పెన్సిల్వేనియాలో తనపై దాడికి యత్నించారని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు. ప్రస్తుతం కాల్పులకు పాల్పడిన వ్యక్తి కాలిఫోర్నియాకు చెందినవాడు. తనతోపాటు మెలానియా, జేడీ వాన్స్ కేబినెట్ సభ్యులంతా క్షేమమని తెలిపారు. నెల రోజుల్లో డిన్నర్ మీట్ రీషెడ్యూల్ చేస్తామన్నారు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×