E-Paper
Advertisement

తక్కువ ఖర్చుతో మంచి ప్రొటీన్ ఫుడ్స్.. కండరాల బలానికి డాక్టర్లు సూచించే పోషకాహారాలు

తక్కువ ఖర్చుతో మంచి ప్రొటీన్ ఫుడ్స్..  కండరాల బలానికి డాక్టర్లు సూచించే పోషకాహారాలు
Advertisement

Protein Rich Cheap Foods: శరీరంలో బలం, కండరాల నిర్మాణం, శరీర మరమ్మత్తు కోసం ప్రోటీన్ శక్తి అవసరం. చాలా మంది భారతీయులు ఇప్పటికీ ప్రతిరోజు అవసరమైన ప్రోటీన్ కంటే తక్కువగా తీసుకుంటున్నారు. తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వలన శరీరం బలహీనంగా, పేలవంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రొటీన్ లోపం.. కండరాలు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శాఖాహారులు తరుచూ ప్రొటీన్ ఏం తినాలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జెనెరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటీజ్ వైద్య నిపుణులు డాక్టర్ కోమల్ కులకర్ణి ఇండియన్ డైట్ లో తక్కువ ఖర్చుతో లభించే మంచి ప్రొటీన్ ఫుడ్స్ సూచించారు.

ఉదయాన్నే ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవాలి

చాలా మంది భారతీయులు ఉదయాన్నే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తింటారు. దీంతో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఆకలి త్వరగా అవుతుంది. ఉదయపు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మూంగ్ దాల్ చిల్లా, గుడ్లు, పనీర్ టోస్ట్, మొలకలు ఆహారాలు అధిక మొత్తంలో ప్రొటీన్ కలిగి ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం రోజంతా శక్తినిస్తాయి.

పప్పులు, కూరగాయలను ప్రతి రోజూ తినాలి

Advertisement

ప్రొటీన్ తక్కువ ఖర్చుతో ఈజీగా లభించే ఆహారం పప్పులు. రాజ్మా, చనా, మూంగ్ దాల్ కూడా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ పప్పులు తినడం వలన ప్రోటీన్ తీసుకోవడం సహజంగా మెరుగుపడుతుంది. అవి మంచి జీర్ణక్రియకు ఫైబర్ ను కూడా అందిస్తాయి. వైద్యుల ప్రకారం.. ధాన్యాలను పప్పులతో కలపడం మంచిది. చపాతీతో దాల్ లేదా అన్నంతో పప్పు కలిపి తినడం చాలా మంచి ఆప్షన్.

పాల ఉత్పత్తులు, గింజలు, డ్రై ఫ్రూట్ నట్స్ చేర్చాలి

పాలు, పెరుగు, పనీర్‌లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ ఫుడ్స్ భారతీయ ఆహారంతో పాటు తినడం సులభం.పెరుగు జీర్ణక్రియకు, ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బాదం, వేరుశెనగ, అవిసె గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. వీటిని సలాడ్ లేదా అల్పాహార గిన్నెలలో చేర్చవచ్చు. కాల్చిన చనా కూడా ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్ గా పనిచేస్తుంది.

Advertisement

Also Read: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? ఈ నాలుగు అలవాట్లే కారణం..

గుడ్లు, చేపలు, చికెన్ ఎందుకు ఎంచుకోవాలి?

మాంసాహార ఆహారాలలో పూర్తి ప్రోటీన్ మూలాలు ఉంటాయి. గుడ్లు సరసమైనవి, వండడానికి కూడా సులభంగా ఉంటాయి. చేపలు, చికెన్ కండరాల పెరుగుదల, పునరుద్ధరణకు తోడ్పడతాయి. అవి అవసరమైన పోషకాలు, ఒమేగా-3 కొవ్వులను కూడా అందిస్తాయి. వైద్యులు గ్రిల్ చేసిన లేదా తేలికగా వండిన ఆహారాలను సూచిస్తున్నారు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×