E-Paper
Advertisement

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!
Advertisement

Delhi TTD: ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ విశేష ఆధ్యాత్మిక వేడుకల గురించి ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం, వేడుకల విజయవంతం కోసం ఆలయ కమిటీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్య అతిథులు ,ఆహ్వానాలు

Advertisement

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడమే తమ లక్ష్యమని సుమంత్ రెడ్డి పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యాలు – భద్రత

Advertisement

ఢిల్లీ నుంచే కాకుండా ఉత్తర భారతదేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తుతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా అత్యవసర సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభంగా అయ్యేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. దర్శనం అనంతరం అందరికీ ప్రసాదం అందేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.

బ్రహ్మోత్సవాల తేదీలు

ఈ ఆధ్యాత్మిక వేడుకలు ఈ నెల 30వ తేదీన అంకురార్పణతో ప్రారంభమై, వరుసగా పది రోజుల పాటు కొనసాగుతాయి.మే 1వ తేదీన ధ్వజారోహణంతో ప్రధాన ఉత్సవాలు మొదలవుతాయి. మే 5న స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ, విశేషమైన కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. మే 10న పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

సాంస్కృతిక ప్రదర్శనలు , విశేషాలు

తిరుమల నుండి ప్రత్యేకంగా వచ్చే కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు, సాంప్రదాయ గానాలతో భక్తులను అలరించనున్నారు. మరో విశేషమేమిటంటే, స్వామివారి భక్తురాలు జయశ్రీ రూపొందించిన భగవద్గీతను ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు సైతం అర్థమయ్యేంత సులభ శైలిలో ఆమె దీనిని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. భక్తులందరూ ఈ సేవలను తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ కోరుతోంది.

Also Read: మృగాల కంటే ఘోరం.. ప్రాణం తీస్తున్న ‘బ్లడ్’ మాఫియా గుట్టురట్టు

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×