E-Paper
Advertisement

ఏసీయే ఉండాలా ఏంటి.. కర్టెన్లు, ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోండిలా!

ఏసీయే ఉండాలా ఏంటి.. కర్టెన్లు, ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోండిలా!
Advertisement

Summer Cooling Tips: ఈ సమ్మర్‌లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు నిత్యం ఆన్‌లో ఉండటం వలన నెలాఖరికి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. అలాగని ఈ వేడి సెగలకు చల్లదనం లేకుండా అస్సలు ఉండలేము. అయితే.. రోజంతా ఇలాంటి కరెంటుతో నడిచే పరికరాలనే కాకుండా, కాస్త తెలివిగా ఆలోచిస్తే కరెంటు బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు. అలాగే ఏసీ, ఫ్యాన్లు, కూలర్లు లేకుండానే ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అదెలాగనే కదా మీ డౌట్? మన ఇంట్లో ఆల్రెడి కిటికీలకు ఉన్న కర్టెన్లు, కొన్ని రకాల మొక్కలతోనే ఇంటిని చల్లటి నందనవనంలా మార్చుకోవచ్చు.

కర్టెన్లు వాడే విధానం ఇది..

ఇంట్లోకి వేడి ఎక్కువగా కిటికీల ద్వారానే వస్తుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలకు మందపాటి తెరలు వేయడం వల్ల వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది. వీలైనంత వరకు తెలుపు లేదంటే లేత రంగులో ఉండే నూలు, జనపనార కర్టెన్లను వాడటానికి ప్రయత్నించండి. ఇవి సూర్యరశ్మిని అడ్డుకుని, గదిలో ఉక్కపోత లేకుండా చేస్తాయి. అలాగే సాయంత్రం ఎండ తగ్గాక ఈ తెరలను పక్కకు జరిపితే బయట ఉండే చల్లని గాలి లోపలికి వస్తుంది. దీంతో ఇంటి వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది.

సమ్మర్‌లో ఉండాల్సిన మొక్కలు..

Advertisement

ఇంట్లో మొక్కలు పెంచడం కేవలం అందం కోసమే అనుకుంటే పొరపాటే. కలబంద, స్నేక్ ప్లాంట్, అరెకా పామ్ వంటి మొక్కలు ఇంట్లోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. ఇవి ఆకుల ద్వారా తేమను విడుదల చేస్తూ గాలిని ఎప్పటికప్పుడు చల్లబరుస్తాయి. వీటి వల్ల గదిలో వేడి తగ్గడమే కాకుండా మనం పీల్చే గాలిని కూడా శుద్ధి అవుతుంది. ఈ మొక్కలు అనేవి రూపాయి ఖర్చు లేకుండా సహజమైన ఎయిర్ కండిషనర్ల మాదిరి పని చేస్తాయన్నమాట.

Also Read: అమ్మో, ఇన్ని రోజులు తెలియక పారేశామే.. సిలికా జెల్ ప్యాకెట్స్‌తో ఇన్ని బెనిఫిట్సా!

మొక్కలు కిటికీల దగ్గరే ఎందుకు?

Advertisement

అలాగే మొక్కలను గది మూలల్లో కంటే కిటికీల దగ్గర పెట్టడం మంచిది. దీని వలన బయట నుంచి వచ్చే గాలి ఈ పచ్చని ఆకులను తాకుతూ లోపలికి రావడం వల్ల మరింత చల్లగా మారుతుంది. ఇది మనకు ఒక రకమైన కూలర్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది. గదిలో గాలి ప్రసరణ బాగా ఉండాలంటే కిటికీల దగ్గర ఆకులు ఎక్కువగా ఉండే పెద్ద మొక్కలను పెట్టుకోవడం మంచిది. ఈ విధానం గాలిని అందించడమే కాకుండా.. గదికి కొత్త లుక్‌ను కూడా ఇస్తుంది.

చల్లదనంతో పాటు ఆరోగ్యం కూడా..

ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వచ్చే చల్లదనం కంటే.. ఇలా ప్రకృతి సిద్ధంగా వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏసీల వల్ల వచ్చే చర్మ సమస్యలు, కళ్ల మంటలు వంటివి ఇలాంటి సహజ పద్ధతుల్లో ఉండవు. పచ్చని మొక్కల మధ్య ఉండటం వల్ల రోజంతా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వేసవిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఇంటిని చల్లగా మార్చేసుకోవచ్చు.

Also Read: వేసవి సెలవుల్లో పిల్లల కోసం స్పెషల్ మిల్క్ షేక్స్.. రెండు నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు!

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×