Summer Drinks: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలు రోజంతా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాగని బయట దొరికే కృత్రిమ రంగులు, షుగర్ డ్రింక్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు, ఇంట్లోనే ఆరోగ్యకరమైన మిల్క్ షేక్స్ చేసి ఇస్తే వాళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీని కోసం నట్స్ – బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వొచ్చు. ఈ జ్యూసులు పిల్లలకు కావాల్సిన శక్తిని ఇస్తూనే.. వాళ్లని వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్‌గా రెండు పదార్థాలతో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండిన అరటిపండు – ఒకటి
కాచి చల్లార్చిన పాలు – ఒక పెద్ద గ్లాసు
నానబెట్టిన బాదం, జీడిపప్పు – కొన్ని
తేనె లేదా బెల్లం తురుము: రుచికి సరిపడా
యాలకుల పొడి – చిటికెడు
ఐస్ క్యూబ్స్ – అవసరమైతే
Also Read: రోజంతా ఏసీలో ఉన్నంత చల్లగా ఉండాలా? అయితే ఈ రాగి పాలు తాగాల్సిందే!
ముందుగా అరటిపండును చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్‌లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, తేనె, యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అందులో చల్లని పాలు పోసి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే.. పైన కొంచెం బాదం తురుము చల్లి గ్లాసులోకి సర్వ్ చేస్తే రుచికరమైన మిల్క్ షేక్ రెడీ.
* అరటిపండు, పాలు కలిపి తీసుకోవడం వల్ల పిల్లలకు రోజంతా కావలసిన ఎనర్జీ అందుతుంది.
* ఈ మిల్క్‌షేక్‌లో వాడిన బాదం, జీడిపప్పు పిల్లల జ్ఞాపకశక్తికి మేలు చేస్తాయి.
* అరటిపండులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఈ జ్యూసులో వైట్ షుగర్ వాడకపోవడం వల్ల పిల్లలకు వంద శాతం సేఫ్.
Also Read: ఈ వంటకాలను డైట్‌లో చేర్చుకుంటే.. షుగర్ ఉన్నవాళ్లు ఇన్సులిన్ వాడాల్సిన పనిలేదు!