E-Paper
Advertisement

అమ్మో, ఇన్ని రోజులు తెలియక పారేశామే.. సిలికా జెల్ ప్యాకెట్స్‌తో ఇన్ని బెనిఫిట్సా!

అమ్మో, ఇన్ని రోజులు తెలియక పారేశామే.. సిలికా జెల్ ప్యాకెట్స్‌తో ఇన్ని బెనిఫిట్సా!
Advertisement

Silica Gel Uses: మనలో చాలామందికి సిలికా జెల్ అంటే తెలిసే ఉంటుంది. కొత్త షూస్ కొన్నా లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు, వాటర్ బాటిల్స్ కొన్నా.. వాటిల్లో తెల్లటి చిన్న ప్యాకెట్లు కనిపిస్తాయి కదా. వాటి మీద సిలికా జెల్ అని రాసి ఉంటుంది. చాలామంది అవి ఎందుకులే అని చెత్తబుట్టలో పారేస్తుంటారు. నిజానికి ఆ చిన్న సిలికా జెల్ ప్యాకెట్ చేసే సాయం అంతా ఇంతా కాదు. గాలిలో ఉండే తేమను పీల్చుకోవడంలో వీటికి మించింది లేదు. ఈ నేపథ్యంలో సిలికా జెల్‌ను ఎలా వాడుకోవచ్చో చూద్దామా!

ఫోన్ నీళ్లలో పడిందా?

ఎప్పుడైనా స్మార్ట్‌ఫోన్ అనుకోకుండా నీళ్లలో పడితే.. వెంటనే బియ్యం డబ్బాలో పెట్టడం మనందరికీ తెలిసిన చిట్కానే. అయితే బియ్యం కంటే ఈ సిలికా జెల్ ప్యాకెట్లు ఇంకా వేగంగా పని చేస్తాయి. ఒక చిన్న డబ్బా తీసుకుని అందులో ఫోన్ పెట్టి, చుట్టూ నాలుగైదు సిలికా జెల్ ప్యాకెట్లు వేసి మూత పెట్టేయండి. ఫోన్ లోపల ఎక్కడైనా తడి ఉన్నా సరే, ఈ ప్యాకెట్లు ఆ తేమను లాగేసి మీ ఫోన్ మళ్లీ కండిషన్‌లో ఉండేలా చూస్తాయి.

Advertisement

Also Read: మీ పార్ట్‌నర్‌తో ముద్దుల్లో మునిగి తేలుతున్నారా? జాగ్రత్త.. ఆ జబ్బు ప్రాణాంతకంగా మారవచ్చు!

నగల మెరుపు తగ్గకూడదంటే? 

బంగారం, వెండి నగలను మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. కానీ కొన్నాళ్ల తర్వాత వెండి వస్తువులు నల్లగా మారిపోతుంటాయి. గాలిలో ఉండే తేమ వల్లే ఇలా జరుగుతుంది. అందుకే జ్యువెలరీ బాక్స్‌లో ఒక సిలికా ప్యాకెట్ వేసి ఉంచండి. అది తేమను రానీయదు. దీనివల్ల నగలు ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తూనే ఉంటాయి. పదే పదే పాలిష్ చేయించాల్సిన అవసరం కూడా ఉండదు.

షూస్ దుర్వాసన వస్తోందా?

Advertisement

వర్షాకాలంలో షూస్ తడిచినా లేదా ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల వచ్చే చెమట వల్లనైనా బ్యాడ్ స్మెల్ రావడం కామన్. అలాంటప్పుడు రాత్రి పూట షూస్‌లో ఈ ప్యాకెట్లను ఉంచండి. అవి తేమను, దుర్వాసనను పీల్చుకుని, మరుసటి రోజుకి మీ షూస్‌ని తాజాగా ఉంచుతాయి. బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి ఇదొక మంచి మార్గం.

ముఖ్యమైన డాక్యుమెంట్లు సేఫ్..

మన దగ్గర ఉండే రేషన్ కార్డులు, పట్టా దస్తావేజులు లేదా పాత కాలపు ఫొటోలు తేమ తగిలితే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఫైల్స్ మధ్యలో లేదంటే బీరువా అరల్లో ఈ చిన్న ప్యాకెట్లను పడేయండి. కాగితాలు పాడవకుండా, ఫంగస్ పట్టకుండా ఏళ్ల తరబడి పదిలంగా ఉంటాయి. చూశారుగా.. వేస్ట్ అనుకునే ఆ చిన్న ప్యాకెట్లు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిశాక కూడా వాటిని అస్సలు పారేయొద్దు.

Also Read: ఇంట్లో చీపురును ఆ దిశలో పెడితే.. అప్పుల బాధ తప్పదట, వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే?

Related News

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

Big Stories

Advertisement
×