E-Paper
Advertisement

Papaya For Skin Whitening: బొప్పాయితో గ్లోయింగ్ స్కిన్.. ఇలా వాడితే రెట్టింపు సౌందర్యం

Papaya For Skin Whitening: బొప్పాయితో గ్లోయింగ్ స్కిన్.. ఇలా వాడితే రెట్టింపు సౌందర్యం
Advertisement

Papaya For Skin Whitening: ప్రకృతి ప్రసాదించిన పండ్లలో బొప్పాయి చాలా ప్రత్యేకమైంది. ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా.. అందానికి కూడా అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా చర్మం రంగును మెరుగుపరచుకోవాలని ఆరాటపడే వారికి ఇది ఒక గొప్ప వరం. బొప్పాయిలో ఉండే ప్రత్యేక ఎంజైములు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, ముఖానికి కొత్త మెరుపును ఇస్తాయి. రసాయనాలతో తయారు చేసిన క్రీముల కంటే ఇంట్లోనే బొప్పాయితో చేసుకునే చిట్కాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మరి బొప్పాయిని చర్మం తెలుపు కోసం ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బొప్పాయితో చర్మం మెరుపు:
బొప్పాయిలోని ప్రత్యేకత:
బొప్పాయిలో పపైన్ అనే గొప్ప ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి శుభ్రం చేయడానికి సహాయ పడుతుంది. సాధారణంగా ఎండ వల్ల లేదా కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారుతుంది. బొప్పాయిని వాడటం వల్ల చర్మంపై పేరుకుపోయిన నలుపు క్రమంగా తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్లు చర్మానికి పోషణను అందించి, ముఖాన్ని మృదువుగా మారుస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే ఈ పండుతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం చాలా సులభం.

Advertisement

తేనె, బొప్పాయి మిశ్రమం:
చర్మం తెల్లగా మారడానికి బొప్పాయి , తేనె కలిపి వాడటం ఒక ఉత్తమ మార్గం. బాగా పండిన బొప్పాయి ముక్కను మెత్తగా చేసి.. అందులో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మానికి తేమను అందిస్తే.. బొప్పాయి రంగును మెరుగు పరుస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

నిమ్మరసంతో బొప్పాయి :
జిడ్డు చర్మం ఉన్నవారికి బొప్పాయి , నిమ్మరసం బాగా పనిచేస్తాయి. నిమ్మరసంలో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రపరిస్తే, బొప్పాయి నలుపును తగ్గిస్తుంది. బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న జిడ్డును తొలగించి.. రంగును పెంచుతుంది. ఎండలోకి వెళ్లడం వల్ల వచ్చే నలుపును తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన చిట్కా. అయితే నిమ్మరసం తక్కువ మోతాదులో వాడటం మంచిది.

Advertisement

Also Read: ఆకుపచ్చ ద్రాక్ష Vs నల్లటి ద్రాక్ష.. ఏవి ఆరోగ్యానికి బెస్ట్ ?

పాలు, బొప్పాయి వాడకం:
పొడి చర్మం ఉన్నవారు బొప్పాయిని పాలతో కలిపి వాడాలి. పచ్చి పాలు , బొప్పాయి గుజ్జును కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడుతుంది. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తెల్లగా మార్చడానికి దోహదపడుతుంది. ఈ రెండింటి వల్ల ముఖం మీద ఉన్న పొడిబారిన చర్మం పోయి, ముఖం తాజాగా కనిపిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయిని క్రమంగా వాడటం వల్ల చర్మం రంగులో మార్పును గమనించవచ్చు. అయితే ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. సహజమైన పద్ధతి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తుల కంటే ఇవి సురక్షితమైనవి. అందమైన , తెల్లని చర్మం కోసం మీరు కూడా బొప్పాయిని మీ డైలీ స్కిన్ కేర్ లో భాగంగా చేసుకోండి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ముఖం ఎప్పుడూ కాంతివంతంగా వెలిగిపోతుంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×