E-Paper
Advertisement

Jr NTR: ఎన్టీఆర్‌ను పట్టించుకోని ధురంధర్ నటుడు.. మహేష్, అల్లు అర్జున్‌కి మాత్రమే గౌరవం..!

Jr NTR: ఎన్టీఆర్‌ను పట్టించుకోని ధురంధర్ నటుడు.. మహేష్, అల్లు అర్జున్‌కి మాత్రమే గౌరవం..!
Advertisement

Jr NTR:తాజాగా విడుదలైన ధురంధర్: ది రివెంజ్ సినిమా మంచి విజయం సాధించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి చర్చకు దారితీసింది. ముఖ్యంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఈ సినిమాపై స్పందించడం ఆసక్తికరంగా మారింది.

మొదటగా అల్లు అర్జున్ ఈ సినిమాను ప్రశంసించారు. ఆయన చెప్పిన మంచి మాటలకు సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మాధవన్ వెంటనే స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ నుంచి ప్రశంసలు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని మాధవన్ పేర్కొన్నారు.

Advertisement

అదే విధంగా మహేష్ బాబు కూడా ఈ సినిమాపై స్పందించారు. ఆయన ఈ చిత్రాన్ని “పర్ఫెక్ట్ ప్రిసిషన్‌తో చేసిన ఎక్స్‌ప్లోజన్” అని అభివర్ణించారు. మహేష్ బాబు కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కూడా మాధవన్ స్పందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా మాధవన్ నటనపై ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమాలో ప్రతి సీన్‌లో మాధవన్ అద్భుతంగా నటించారని, ఆయన నటన ఈ సినిమాకు హైలైట్ అని అన్నారు.

Advertisement

అయితే ఇక్కడే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అల్లు అర్జున్, మహేష్ బాబు ట్వీట్లకు వెంటనే స్పందించిన మాధవన్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు మాత్రం స్పందించలేదు. ఇది అభిమానుల్లో చర్చకు దారితీసింది.

కొంతమంది ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం టైమింగ్ సమస్య కావచ్చని, మాధవన్ ఆ ట్వీట్ చూడకపోయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కొద్దిగా నిరాశకు అలానే ఆగ్రహానికి గురిచేస్తుంది.

ALSO READ: Mrunal Thakur: సిగ్గు లేకుండా. అవకాశాలు అడిగాను.. కెరీర్ కష్టాలను బయట పెట్టిన మృణాల్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×