E-Paper
Advertisement

భార్య కావాల్సిందే.. లేదంటే దూకేస్తా! రేడియో టవర్ పై భర్త హైడ్రామా…వైరల్ వీడియో

భార్య కావాల్సిందే.. లేదంటే దూకేస్తా! రేడియో టవర్ పై భర్త హైడ్రామా…వైరల్ వీడియో
Advertisement

Adoni Drama : వివాహ బందాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయ్. కొందరు భార్య వద్దే వద్దంటూ అడ్డు తొలిగించుకుంటుంటే మరికొందరు మాత్రం నా భార్య నాక్కావలిసిందే అంటూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.ఇదిగో తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మూడు ముళ్ళు వేసిన తన భార్య తనతో కాపురం చేయట్లేదని, ఆమెను ఇప్పుడే ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు ఏకంగా రేడియో స్టేషన్ టవర్ ఎక్కి గంటల పాటు హల్చల్ చేశాడు.

అసలేం జరిగింది?

Advertisement

నిమ్మకల్లు గ్రామానికి చెందిన సురేంద్రకి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అయితే, దంపతుల మధ్య గొడవల కారణంగా గత కొంతకాలం కిందట అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు నచ్చజెప్పినా, పెద్ద మనుషులతో రాయబారం పంపినా ఆమె తిరిగి రావడానికి ఇష్టపడలేదని సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేంద్ర శనివారం ఉదయం ఆదోనిలోని రేడియో స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. ఎవరూ గమనించని సమయంలో చకచకా అక్కడున్న ఎత్తైన టవర్‌ను ఎక్కేశాడు. టవర్ పైకి వెళ్ళిన తర్వాత గట్టిగా అరుస్తూ, తన భార్యను తన వద్దకు పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరింపులకు దిగాడు.

భార్య రావాల్సిందేనని పట్టు

Advertisement

దీంతో టవర్ పై యువకుడుని చూసిన అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సురేంద్రను కిందకు దింపేందుకు ప్రయత్నించారు. అయితే, సురేంద్ర మాత్రం పోలీసుల మాట వినకుండా భార్య రావాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ లోపు ఈ విషయం చుట్టుపక్కల తెలీడం, రేడియో స్టేషన్ వద్దకు జనం భారీగా పోగవడం చక చక జరగడంతో అక్కడ అసలేం జరగబోతుందా అన్న హైడ్రామా మొదలైంది.

సీఐ ఎంట్రీతో కథ సుఖాంతం

ఇక అక్కడి పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రంగంలోకి దిగారు స్థానిక సీఐ. సురేంద్రతో ఫోన్లో మాట్లాడి “నీ సమస్య మాకు అర్థమైంది, భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. కిందకు వస్తే మీ భార్యతో మాట్లాడి, మీ సమస్యను పరిష్కరిస్తాం” అని గట్టిగా భరోసా ఇచ్చారు.లీగల్ గానూ సాయం చేస్తామని, భార్యను పంపించే బాధ్యత తమదని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర దిగివచ్చాడు.

అలా దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన ఈ హైడ్రామాకు సురేంద్ర కిందకు దిగడంతో తెరపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు తరలించారు.

also read:డ్రాగన్ లో ప్రభాస్ ఎంట్రీ? నీల్ సినిమాలో ‘దేవ’ కామియో.. లీక్ నెట్టింట వైరల్ !

సోషల్ మీడియాలో వైరల్

ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ప్రేమంటే సురేంద్రదే.. కానీ ఆ పద్ధతే బాలేదు” అని కొందరు అంటే “సమస్యల పరిష్కారానికి టవర్లు ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఏదేమైనా ఆదోనిలో జరిగిన ఈ ‘టవర్’ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×