Nithya Comments : 37 ఏళ్ల వయసులో సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ పై చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ అనేది పెళ్ళికి ముందా తర్వాతా అన్నది అసలు ముఖ్యమే కాదని చెప్పుకొచ్చింది.
పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు
పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనడంలో అసలు తప్పేలేదని, పిల్లలు కావాలనుకుంటే పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదని, అది పూర్తిగా ఒక వ్యక్తిగత నిర్ణయమని తేల్చి చెప్పింది. ఇక ప్రస్తుతం సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు పెళ్లి పై తనకున్న అభిప్రాయం చెబుతూ .. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమే తప్ప, అదే జీవితం కాదని స్పష్టంగా చెప్పింది. తనకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని, తనను ఎవరూ నియంత్రించలేరని కుండబద్దలు కొట్టింది.
సోలో లైఫ్ గురించి క్లారిటీ
ఒకప్పుడు వాళ్ళ అమ్మమ్మ పెళ్లి కోసం ఒత్తిడి చేసేదని, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ తన సోలో లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చింది. నిజమైన ప్రేమ దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని, కానీ పెళ్లి జరగకపోయినా జీవితం ఆగిపోదని నిత్యా అభిప్రాయపడింది. దీంతో నిత్యా చాలా మెచ్యూర్డ్ గా థింక్ చేస్తుందని కొందరంటుంటే , అందరూ ఇలాగే ఆలోచిస్తే వివాహ వ్యవస్థ ఏమైపోవాలని మరికొందరు నెగటివ్ కామెంట్స్ వదులుతున్నారు.
also read:డ్రాగన్ లో ప్రభాస్ ఎంట్రీ? నీల్ సినిమాలో ‘దేవ’ కామియో.. లీక్ నెట్టింట వైరల్ !
గ్లామర్ షో కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా
ఇక నిత్యా మీనన్ సినీ కెరీర్ విషయానికి వస్తే అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిత్యా మీనన్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అలా కేవలం గ్లామర్ షో కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కథా ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించడం విశేషం.అందుకే మన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని లాంటి స్టార్ హీరోల సరసన ఎంత గొప్పగా నటించిందో.. కోలీవుడ్‌లో విజయ్, సూర్య, ధనుష్ వంటి బిగ్ స్టార్స్ సినిమాల్లోనూ అంతే ఇంపాక్ట్ చూపించి ప్రశంసలు అందుకుంది కూడా.
జాతీయ ఉత్తమ నటి
ఇక తిరుచిత్రంబలం (Thiruchitrambalam – 2022)అనే తమిళ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం(National Award for Best Actress) లభించడం ఆమె కెరీర్ మరో గోల్డెన్ మైల్ స్టోన్ అని చెప్పాలి.
చూడాలి మరి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలతోనే పిల్లల్ని కనొచ్చు, అందుకు పెళ్ళితో పనిలేదు అంటున్న నిత్యా కామెంట్స్ పై ముందు ముందు ఇంకెలాంటి రియాక్షన్స్ పడతాయో..ఇది కూడా
also read :భార్య కావాల్సిందే.. లేదంటే దూకేస్తా! రేడియో టవర్ పై భర్త హైడ్రామా…వైరల్ వీడియో