E-Paper
Advertisement

Neem Leaves: వేపాకును ఇలా వాడితే అన్నీ సమస్యలు మటు మాయం..

Neem Leaves: వేపాకును ఇలా వాడితే అన్నీ సమస్యలు మటు మాయం..
Advertisement

Neem Leaves: ఒక చెట్టుతో మనుషులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. చెట్టు నీడతో పాటు చెట్టు కొమ్మలు, కాండం, ఆకులు, వేరు ఇలా ప్రతీ దాంట్లోను ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా వేప చెట్టు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వేప చెట్టు అణువణువుతో మనుషులకు పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. వేప ఆకులు, కాయలు, పువ్వు, కొమ్మలు, కాండం, వేర్లు ఇలా ప్రతీ దాంట్లోను ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే వేపతో చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వేప ఆకుల చర్మ సమస్యల నివారణకు తోడ్పడతాయి.

వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వివిధ రకాలుగా పనిచేస్తుంది. వేపాకును తరచూ స్నానం చేసే నీటిలో వేసుకున్నా కూడా శరీరంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల్లో వేపాకును ఎక్కువగా వాడుతుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వేపాకుతో చాలా రకాల సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే అవేంటో తెలుసుకుందాం.

Advertisement

చర్మ సమస్యలు :

వర్షాకాలంలో ఎదుర్యయే చర్మ సమస్యలకు వేపాకు ఔషధంలా పనిచేస్తుంది. దురద, దద్దుర్లు వంటి వాటిని వేపాకు పూసి తొలగించుకోవచ్చు. దీనికి కొన్ని వేపాకులను తీసుకుని అరగంట పాటు నీటిలో బాగా మరిగించి స్నానం చేసే నీటిలో కలుపుకుని చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు అన్నీ తొలగిపోతాయి.

Advertisement

మధుమేహం :

వేపాకులో ఉండే టెర్పెనాయిడ్స్, ప్లేవనాయిడ్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అందువల్ల తరచూ వేపాకులను తీసుకుంటే మొటిమలు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఉదర సమస్యలు :

శరీరానికి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు నివారణగా వేపాకును తీసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కాపాడుతాయి. మరోవైపు కడుపులో ఉండే నులిపురుగులను కూడా తొలగిస్తుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరచేందుకు వేపాకులు తోడ్పడతాయి.

మొటిమలు :

చర్మంపై వర్షాకాలంలో మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల వేప బెరడును రుబ్బి మొటిమలు, మచ్చలు ఉన్న ప్లేస్ లో రాయడంతో ఆ సమస్య తగ్గుతుంది.

వైరల్ ఫీవర్ :

వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×