BigTV English

Helicopter crash: హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్..పైలట్ దుర్మరణం

Helicopter crash: హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్..పైలట్ దుర్మరణం

Helicopter crashes onto roof of Australian hotel: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున పర్యాటక పట్టణం కెయిన్స్‌లోని ఓ హోటల్‌పై హెలికాప్టర్ కుప్పకూలింది. వెంటనే మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.


ఉత్తర క్వీన్స్ లాండ్ నగరంలో ప్రఖ్యాత గాంచిన సముద్రతీర హిల్టన్ హోటల్ పైకప్పుపై హెలికాప్టర్ కూలింది. దీంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆ హోటల్‌లో ఉన్న వందలాది మందిని అక్కడినుంచి తరలించారు. వెంటనే అక్కడి సిబ్బంది క్వీన్స్ లాండ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని హోటల్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.

హెలికాప్టర్ కూలిన ఘటనలో హోటల్ లో ఉన్న అతిథులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, హోటల్‌పై ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అవుతుండగా ఒకటి క్రాష్ ల్యాండ్ అయినందున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయంపై ట్రాన్స్ పోర్ట్ సేప్టీ రెగ్యులేటరీ విచారణ ప్రారంభించింది.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×