E-Paper
Advertisement

Electric Kettle: మీ దగ్గర ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు.. ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ లు చేసుకోవచ్చు

Electric Kettle: మీ దగ్గర ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు.. ఈ సింపుల్  బ్రేక్‌ఫాస్ట్ లు చేసుకోవచ్చు

గ్యాస్ సిలిండర్ లేకపోతే వంట చేయడం కష్టమే. అది నిజమే కానీ అత్యవసర పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, సులభంగా కొన్ని బ్రేక్‌ఫాస్ట్ వంటలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగాల కోసం బయట ఉండేవారు, ప్రయాణాల్లో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో అనేక వంటలు చేసుకునే అవకాశం ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా దొరుకుతుంది.

ఏం వండవచ్చు?
ఎలక్ట్రిక్ కెటిల్లో చేయగలిగే వంటల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఓట్స్. కెటిల్‌లో పాలు లేదా నీరు మరిగించి అందులో ఓట్స్ వేసి కొద్దిసేపు ఉంచితే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం అవుతుంది. అలాగే గుడ్లు కూడా చాలా ఈజీగా ఉడికించవచ్చు. కెట్టిల్‌లో నీరు వేసి గుడ్లు వేసి ఆన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే బాయిల్డ్ ఎగ్స్ రెడీ అవుతాయి. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. త్వరగా తినేయచ్చు.

నూడుల్స్, ఉప్మా కూడా
మ్యాగ్గీ నూడుల్స్ చాలా మందికి ఇష్టమైన వంటకం. కెటిల్‌లో నీరు మరిగించి నూడుల్స్ వేసి కొద్దిసేపు ఉడికిస్తే చాలు. అలాగే ముందుగా వేయించిన రవ్వ ఉంటే ఉప్మా కూడా తయారవుతుంది. కొద్దిగా కూరగాయలు, మసాలాలు వేసుకుంటే రుచిగా ఉంటుంది. అదేవిధంగా దలియా (గోధుమ రవ్వ) కూడా కెటిల్‌లోనే ఉడికించి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇవి తక్కువ ఖర్చుతో తయారయ్యే వంటలు.

Also read: Rice Water: అన్నం వండిన గంజిని పారేస్తున్నారా? ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసా?

మొక్కజొన్న గింజలు
తేలికగా తినాలనుకునేవారికి మరికొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఇన్‌స్టంట్ ఓట్స్ పొరిడ్జ్ వేడి నీటిలో కలిపి కొద్దిసేపు ఉంచితే సిద్ధం అవుతుంది. అలాగే మొక్కజొన్న గింజలను కెట్టిల్‌లో ఉడికించి మసాలాలు కలిపి కార్న్ చాట్‌గా తినవచ్చు. పిల్లలకు, స్వీట్ ఇష్టపడేవారికి బ్రెడ్ అండ్ బటర్ పుడ్డింగ్ కూడా మంచి ఎంపిక. బ్రెడ్ ముక్కలు, పాలు, కొద్దిగా చక్కెర కలిపి కెట్టిల్‌లో వేడి చేస్తే రుచికరమైన స్వీట్ తయారవుతుంది.

మొత్తంగా చూస్తే ఎలక్ట్రిక్ కెట్టిల్ ఒక చిన్న పరికరమే అయినా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. గ్యాస్ లేకపోయినా వంట ఆగిపోదు. తక్కువ సమయంల సులభంగా, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ వంటలు చేసుకోవచ్చు. అయితే కెటిల్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎక్కువ నూనె లేదా ఘన పదార్థాలు వేసి వాడకూడదు. అలాగే కెటిల్ ను తరచుగా శుభ్రం చేసుకుంటే ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు. సరైన విధంగా వాడితే ఎలక్ట్రిక్ కెటిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Also read: Rajma Pulao: రాజ్మా పులావ్.. తింటే రుచే కాదు, పోషకాహారలోపం కూడా రాదు, రెసిపీ ఇదిగో

Related News

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Big Stories

×