E-Paper
Advertisement

Galaxy S25 Ultra Price Drop: గోల్డెన్ ఛాన్స్ మావా.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.24వేల తగ్గింపు!

Galaxy S25 Ultra Price Drop: గోల్డెన్ ఛాన్స్ మావా.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.24వేల తగ్గింపు!
Advertisement

Galaxy S25 Ultra Price Drop: మార్కెట్లో శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, పాత మోడల్స్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై లభించే డీల్స్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం Galaxy S26 series విడుదలైన నేపథ్యంలో, గతేడాది సంచలనం సృష్టించిన Samsung Galaxy S25 Ultra ధర అమెజాన్‌లో భారీగా తగ్గింది.

సుమారు రూ.1,30,000 ధర పలికే ఈ ఫోన్, ఇప్పుడు రూ.1,07,000 ధరకు అందుబాటులోకి రావడం విశేషం. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు కలిపితే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అంటే సుమారు రూ.24వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

అద్భుతమైన పనితీరు:

Advertisement

ఇటీవల విడుదలైన S26 Ultra ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.30వేల తక్కువకు లభిస్తున్నప్పటికీ, పనితీరులో మాత్రం ఎక్కడా తగ్గదు. దీనిలో ఉన్న 6.9 అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే విజువల్స్ పరంగా అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Also Read: స్మార్ట్ రింగ్ vs స్మార్ట్ వాచ్.. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు ఏది బెస్ట్ ఆప్షన్!

200 మెగాపిక్సెల్ కెమెరా:

Advertisement

ఇకపోతే ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అందించారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ వల్ల మల్టీ టాస్కింగ్, గేమింగ్ సాఫీగా సాగుతాయి.

తక్కువ వడ్డీతో EMI:

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ కెమెరా, ఏఐ ఫీచర్లు కావాలనుకుంటూనే, బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండేవారికి ఈ ఆఫర్ బెటర్ ఆప్షన్. దీంతోపాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా వేల రూపాయల అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. తక్కువ వడ్డీతో ఈఎంఐ సౌకర్యం ఉండటం వల్ల మధ్యతరగతి వినియోగదారులు కూడా ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: AIతో వచ్చిన తిప్పలు.. 35% పెరగనున్న ల్యాప్‌టాప్ ధరలు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×