E-Paper
Advertisement

Rajma Pulao: రాజ్మా పులావ్.. తింటే రుచే కాదు, పోషకాహారలోపం కూడా రాదు, రెసిపీ ఇదిగో

Rajma Pulao: రాజ్మా పులావ్.. తింటే రుచే కాదు, పోషకాహారలోపం కూడా రాదు, రెసిపీ ఇదిగో

రాజ్మా పులావ్ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైస్ రెసిపీ. ఇప్పుడు మనవైపు కూడా దీన్ని తినేవారు ఎక్కువగానే ఉన్నారు. బాస్మతి బియ్యం, రాజ్మా (కిడ్నీ బీన్స్), మసాలాలు కలిపి చేసే ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. ఇది సంపూర్ణ భోజనం లాంటిది. దీనిని వండడం కూడా చాలా సులభం. ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు లేదా ప్రత్యేక రోజుల్లో ఈ పులావ్ చేస్తే అందరికీ నచ్చుతుంది.

రాజ్మా పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
రాజ్మా (కిడ్నీ బీన్స్) – అర కప్పు
ఉల్లిపాయ – ఒకటి
టమాటా – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
జీలకర్ర – అర స్పూన్
బిర్యానీ ఆకు – ఒకటి
లవంగాలు – రెండు
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
పసుపు – పావు స్పూన్
కారం పొడి – అర స్పూన్
ధనియాల పొడి – అర స్పూన్
గరం మసాలా – అర స్పూన్
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – అర స్పూన్
ఉప్పు – తగినంత
నూనె లేదా నెయ్యి – 2 స్పూన్లు
నీరు – రెండు కప్పులు

Also read: Spicy Paniyaram: స్పైసీ గుంతపొంగనాలు ఇలా చేస్తే కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతుంది

రాజ్మా పులావ్ రెసిపీ
1. మొదట రాజ్మాను బాగా కడిగి ఒక గిన్నెలో వేసి రాత్రంతా లేదా కనీసం 7–8 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల రాజ్మా త్వరగా ఉడుకుతుంది.
2. తర్వాత నానబెట్టిన రాజ్మాను ప్రెషర్ కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉప్పు, నీరు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.బాస్మతి బియ్యాన్ని కూడా కడిగి సుమారు 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.
4. మొదట ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
5. నూనె వేడిగా అయిన తర్వాత జీలకర్ర వేయాలి. వెంటనే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిసేపు వేయించాలి. ఇలా వేయిస్తే మంచి వాసన వస్తుంది.
6. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
7. తర్వాత తరిగిన టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాటా మెత్తగా అయిన తర్వాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
8. ఇప్పుడు ముందుగా ఉడికించిన రాజ్మాను కుక్కర్‌లో వేసి మసాలాతో బాగా కలపాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపి ఇందులో వేసి మెల్లగా కలపాలి.
9. ఇప్పుడు రెండు కప్పుల నీరు, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి మళ్లీ మెల్లగా కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
10. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి మెల్లగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకోవాలి.

వేడివేడిగా ఉన్న రాజ్మా పులావ్‌ను ఉల్లిపాయ రైతా, పెరుగు లేదా సలాడ్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.ఈ పులావ్ లంచ్ లేదా డిన్నర్‌కు చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.

Related News

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Big Stories

×