E-Paper
Advertisement

Flax Seeds Benefits : ప్రతీ రోజూ వీటిని రెండు స్పూన్లు తీసుకుంటే శరీరంలో ఊహించని మ్యాజిక్ చూస్తారు..

Flax Seeds Benefits : ప్రతీ రోజూ వీటిని రెండు స్పూన్లు తీసుకుంటే శరీరంలో ఊహించని మ్యాజిక్ చూస్తారు..
Advertisement

Flax Seeds Benefits: ఆరోగ్యానికి కేవలం కూరగాయలు, పండ్లతో మాత్రమే కాకుండా గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ముఖ్యంగా నానబెట్టిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల సమస్యలను కూడా అవిసె గింజలను తినడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇందులో మలబద్ధకం, కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి వాటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

వేయించిన అవిసె గింజలు కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అవిసె గింజలను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అవిసె గింజలను నూనెలా కూడా ఉపయోగిస్తారు. అవిసె గింజల నూనె, పొడి, మాత్రలు ఉపయోగించి శరీరానికి పుష్కలమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షించేందుకు అవిసె గింజలు సహాయపడతాయి. అవిసె గింజలను ప్రతీ రోజు తీసుకుంటే అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: యోగా చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు.

వర్షాకాలంలో అవిసె గింజలను తీసుకుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. వర్షాకాలంలో ఎదురయ్యే అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి వాటి వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల అవిసె గింజలను తీసుకుంటే శరీరానికి తగిన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇందుకోసం అవిసె గింజలను వేయించి లేదా నానెబెట్టి ఇలా ఏదో ఒక విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు సంరక్షణకు అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. అవిసె గింజలతో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గించుకోవచ్చు.

Advertisement

అవిసె గింజల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అందువల్ల ప్రమాదకర వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. నానబెట్టిన అవిసె గింజల నీటితో జుట్టుకు రాసుకుని స్నానం చేస్తే జుట్టు మృదువుగా, అందంగా తయారవుతుంది. మరోవైపు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు అవిసె గింజలు తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×