BigTV English

Types Of Marriages: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా ?

Types Of Marriages: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా ?

Types Of Marriages: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాంప్రదాయాలను ఆచరిస్తూ ఈ పవిత్ర బంధంతో జంటలు ఒక్కటవుతారు. ఒక్కో మతంలో ఒక్కో రకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. హిందూ, క్రైస్తవ ముస్లిం మతాలంలో తమ తమ సంప్రదాయానికి అనుగుణంగా వివాహాలు జరుపుకుంటారు. కానీ సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలు అనే విషయం చాలా మందికి తెలియదు. హిందూ ధర్మం ప్రకారం వివాహాలు ఎనిమిది రకాలు వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


బ్రహ్మ వివాహం :
అత్యంత ఆదర్శవంతమైన, గౌరవప్రదమైన వివాహంగా దీనిని పరిగణిస్తారు. బ్రహ్మ వివాహాన్ని పెద్దలు కుదిర్చిన వివాహంగా చెబుతారు. బ్రహ్మ వివాహం ముఖ్యంగా వధువు, వరుడి కుటుంబాల సమ్మతితో నిర్వహిస్తారు. ఈ రకమైన పెళ్లిలో వధువు లేదా వరుడికి బదులుగా డబ్బు మార్పిడి, లేదా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు. సనాతన ధర్మంలో అత్యున్నత వివాహంగా దీనిని పరిగణిస్తారు. సాంప్రదాయ ఆచారాలు, వేడుకలు దీనిలో నిర్వహిస్తారు.

దైవ వివాహం:
దైవ వివాహమనేది మత పరమైన వేడుక. ఇది హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆచరించే ఒక రకమైన వివాహం. ఈ వివాహంలో వధువును పూజారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణులకు మాత్రమే అమ్మాయినిచ్చి వివాహం చేయడం దైవ వివాహం.


ఆర్ష వివాహం:
సనాతన ధర్మం ప్రకారం ఆర్ష వివాహంలో వధువు తరపు వారు వరుడి తండ్రికి ఆవు లేదా రెండు ఎద్దులను బహుమానంగా ఇస్తారు. లేదంటే వారికి విలువైన వస్తువులను బహుకరిస్తారు. ఇలా చెల్లించడాన్ని వధువు కుటుంబ సభ్యులు గౌరవ సూచకంగా స్వీకరిస్తారు.

గాంధర్వ వివాహం :
ప్రేమ వివాహాన్నే గాంధర్వ వివాహం అని కూడా పిలుస్తుంటారు. ఒక జంట సాంప్రదాయ వేడుకలను అనుసరించకుండా వ్యక్తిగత ఎంపికతో వివాహం జరుపుకుంటే దానిని గాంధర్వ వివాహం అని అంటారు. వధువు, వరుడి పరస్పర ప్రేమ, సమ్మతి ఆధారంగా ఈ వివాహం జరుగుతుంది. అనేక సంప్రదాయాలు ఈ వివాహాన్ని అంగీకరించడం లేదు.

అసుర వివాహం :
అత్యంత విమర్శనాత్మకమైన వివాహం అసుర వివాహం ఈ వివాహంలో వరుడు లేదా వధువు తమ భాగస్వామిని పొందేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు ఇచ్చి వధువు, వరుడిని కొనుగోలు చేసి పెళ్లి చేసుకుంటారు. ఇది అసలు ఆమోదయోగ్యమైన వివాహం కాదని చెబుతుంటారు.

Also Read: ఆగస్టు 20 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం.. వీరికి టెన్షన్

రాక్షస వివాహం:
వధువు లేదా వరుడుని అపహరించిన తర్వాత చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. కుటుంబం, బంధువులపై హింసాత్మకంగా దాడి చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం రాక్షస వివాహం. పేరులోనే ఉంది రాక్షసత్వం. ఈ వివాహంలో బందీల పట్ల వారి క్రూరత్వాన్ని చూపించి పెళ్లి చేసుకుంటారు.

పైశాచిక వివాహం:
సనాతన ధర్మం ప్రకారం వరుడు లేదా వధువు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారి సమ్మతి లేకుండా చేసుకునే వివాహం పైశాచిక వివాహం. వధువు లేదా వరుడుని మోసగించి ఈ వివాహాన్ని చేసుకుంటారు. ఈ రకమైన వివాహం చాలా విమర్శలను కలిగి ఉంది.

ప్రజాపత్య వివాహం :
ఈ వివాహం సామాజిక ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. వధూవరుల కుటుంబాల ఆమోదం ఈ వివాహానికి ఉంటుంది. సంతానం ఇవ్వమని చెబుతూ ఈ వివాహన్ని చేస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×