E-Paper
Advertisement

Induction Stove Cleaning Tips: ఇండక్షన్ స్టౌవ్ మీద మరకలు పోవట్లేదా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరుస్తుంది

Induction Stove Cleaning Tips: ఇండక్షన్ స్టౌవ్ మీద మరకలు పోవట్లేదా? ఇలా క్లీన్ చేస్తే  కొత్తదానిలా మెరుస్తుంది
Advertisement

Induction Stove Cleaning Tips: ప్రస్తుతం చాలా ఇళ్లలో గ్యాస్ స్టౌవ్ స్థానంలో ఇండక్షన్ వాడకం చాలా పెరుగుతోంది. ఇది తక్కువ టైమ్‌లో వంట చేయడానికి సహాయ పడుతుంది. అలాగే సేఫ్ కూడా. కానీ రోజూ వాడితే కుక్‌టాప్ మీద ఆయిల్ మరకలు, నీటి మచ్చలు పడటం సహజం. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే స్టౌవ్ లుక్ తగ్గిపోతుంది. అంతే కాకుండా పనితీరు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఇండక్షన్ కుక్‌టాప్‌ను సరిగ్గా.. సులభంగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.

ఇండక్షన్ కుక్‌టాప్ ఎలా శుభ్రం చేయాలి?

Advertisement

ఇండక్షన్ కుక్‌టాప్ పై భాగం గ్లాస్‌‌తో తయారు చేస్తారు. అందుకే దీన్ని శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినమైన వస్తువులతో రుద్దితే స్క్రాచ్‌లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన విధానంలో క్లీన్ చేయడం ముఖ్యం.

1. కుక్‌టాప్ చల్లబడిన తర్వాతే శుభ్రం చేయాలి:
వంట చేసిన వెంటనే కుక్‌టాప్‌ను క్లీన్ చేయకండి. అది వేడిగా ఉండే అవకాశం ఉంటుంది. అలా చేస్తే చేతులకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా స్టౌవ్ పూర్తిగా చల్లబడే వరకు ఆగండి. తర్వాతే క్లీనింగ్ మొదలు పెట్టాలి.

Advertisement

2. మృదువైన క్లాత్ లేదా స్పాంజ్:
ఇండక్షన్ కుక్‌టాప్‌ను శుభ్రం చేయడానికి సాఫ్ట్ క్లాత్ లేదా స్పాంజ్ ఉపయోగించాలి. గట్టిగా ఉండే స్క్రబ్బర్ లేదా స్టీల్ వూల్ వాడితే గాజు మీద గీతలు పడతాయి. అందుకే ఎప్పుడూ మృదువైన క్లాత్ తోనే తుడవడం మంచిది.

3. సాధారణ సబ్బు లేదా లిక్విడ్ క్లీనర్ :
చిన్న చిన్న ఆయిల్ మరకలు లేదా మచ్చలు ఉంటే కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ తీసుకుని నీటిలో కలపాలి. ఆ మిశ్రమంలో క్లాత్ ముంచి కుక్‌టాప్‌ను నెమ్మదిగా తుడవాలి. తర్వాత పొడి క్లాత్‌తో మళ్లీ తుడిస్తే.. కుక్‌టాప్ మెరిసి పోతుంది.

4. వెనిగర్ లేదా బేకింగ్ సోడా:
కొన్నిసార్లు ఆయిల్ మరకలు గట్టిగా పడిపోతాయి. అప్పుడు కొద్దిగా వెనిగర్ స్ప్రే చేయడం మంచిది. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లాత్ తో తుడవాలి. అలాగే బేకింగ్ సోడా కూడా మంచి క్లీనర్‌గా పనిచేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడా చల్లి తడి క్లాత్ తో తుడిస్తే మచ్చలు సింపుల్‌గా తొలగిపోతాయి.

5. నీటి మచ్చలు:
కుక్‌టాప్‌ను శుభ్రం చేసిన తర్వాత చాలా మంది అలాగే వదిలేస్తారు. అలా చేస్తే నీటి మచ్చలు పడే అవకాశం ఉంటుంది. అందుకే.. చివరగా డ్రై క్లాత్‌తో పూర్తిగా తుడవాలి. అప్పుడు కుక్‌టాప్ కొత్తలా కనిపిస్తుంది.

Also Read: వేసవిలో చన్నీటి స్నానం చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ

6. రెగ్యులర్‌ క్లీనింగ్ :
ఇండక్షన్ వారానికి ఒక సారి బాగా క్లీన్ చేయడం మంచిది. రోజూ వంట చేసిన తర్వాత చిన్నగా తుడిచినా సరిపోతుంది. ఇలా రెగ్యులర్‌గా క్లీన్ చేస్తే ఎక్కువ మచ్చలు పడవు.. అలాగే స్టౌవ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

ఇండక్షన్‌ను శుభ్రంగా ఉంచడం చాలా సులభం. కేవలం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. అది ఎప్పుడూ కొత్తలా మెరిసిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయకూడదు. అంతే కాకుండా గట్టిగా రుద్దకూడదు, మృదువైన క్లాత్ తో మాత్రమే తుడవాలి. అలాగే వెనిగర్ లేదా బేకింగ్ సోడా వంటి సాధారణ పదార్థాలతో కూడా సులభంగా క్లీనింగ్ చేయవచ్చు. ఇలా రెగ్యులర్‌గా కేర్ తీసుకుంటే ఇండక్షన్ కుక్‌టాప్ ఎక్కువ కాలం బాగానే పనిచేస్తుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×