E-Paper
Advertisement

Strait of Hormuz: ఇరాన్ వార్.. రంగంలోకి నౌకా దళాలు, హార్ముజ్ జలసంధికి యుఎస్ మెరైన్‌ టీమ్స్

Strait of Hormuz: ఇరాన్ వార్..  రంగంలోకి నౌకా దళాలు, హార్ముజ్ జలసంధికి యుఎస్ మెరైన్‌ టీమ్స్
Advertisement

Strait of Hormuz: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొత్త మలుపు తిరిగాయా? ఈసారి నేవీ రంగాలు దిగబోతున్నాయా? హార్ముజ్ జలసంధికి ఇప్పటికే యూఎస్ మెరైన్స్ టీమ్స్ చేరుకున్నాయా? ఇక ఇరాన్‌తో తాడోపేడో తేల్చుకోవడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్-అమెరికా వార్ కొత్త మలుపు.. రంగంలోకి నేవీ బృందాలు

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం రెండో వారానికి చేరుకుంది. తాము ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు ధ్వంసం చేశామని అమెరికా బయటకు చెబుతోంది. అయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమ్ముల పొదలోని బలమైన అస్త్రాలు బయటకు తీస్తోంది. రాత్రి వేళ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై మిస్సైళ్లను ఎక్కుపెడుతోంది. అంతేకాదు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నగరంపై డ్రోన్ల దాడులు చేస్తోంది.

ఇదిలావుండగా హోర్ముజ్ జలసంధి చుట్టూ ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ జలసంధిని మూసివేయాలని ఇప్పటికే ఇరాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ఆయిల్ నౌకలు బయలుదేరే క్రమంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండు నౌకలపై దాడులు చేసింది. యూరప్ నుంచి వచ్చే నౌకలు అక్కడే ఉండిపోవడంతో అమెరికా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.

Advertisement

హార్ముజ్ జలసంధికి యుఎస్ మెరైన్‌ టీమ్స్

ప్రపంచ ఆయిల్ రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో అడ్డంకులు సృష్టిస్తే తాము నిర్ణయాన్ని మార్చుకుంటామని ట్రంప్ శుక్రవారం రాత్రి ప్రకటన చేశారు. ఆదేశంలోని చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. గడిచిన రెండు వారాలుగా హోర్ముజ్ జలసంధికి రెండు వైపులా వందలాది నౌకలు నిలిచిపోయాయి. అందులోని సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా.. తమ మెరైన్ కార్ప్స్ చెందిన ఓ టీమ్‌ని హోర్ముజ్ జలసంధి తరలిస్తోంది. అందుకోసం మూడు నౌకల్లో దాదాపు 2,200 మంది మెరైన్లతో కూడిన యూనిట్‌ని తరలించాలని ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జలసంధికి సమీపంలోకి US మెరైన్ టీమ్ సభ్యులు మోహరించారు.

ALSO READ: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన

మెరైన్‌లను నౌకల పెట్రోలింగ్ కోసం పంపదని, అక్కడ తీవ్రత పెరిగినప్పుడు వారిని తరలిస్తుందని చెబుతున్నారు. ఒక్కో మెరైన్‌ టీమ్‌లో 2,500 మంది సభ్యులు ఉంటారు. సెంట్రల్ కమాండ్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు US రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఆమోద ముద్ర వేసినట్టు మీడియా చెబుతోంది. ప్రస్తుతం మోహరించబడిన యూనిట్ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్. ఈ యూనిట్ సాధారణంగా జపాన్‌లో ఉంటుంది.

మధ్యప్రాచ్యం వైపు వెళ్లాలని ఆ టీమ్‌ని ఆ దేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక యాంఫిబియస్ రెడీ గ్రూప్‌లో ఓ అసాల్ట్ షిప్, రెండు ట్రాన్స్‌పోర్ట్ డాక్ షిప్‌లు, మెరైన్‌లను పరికరాలను మోసుకెళ్ళే సపోర్ట్ షిప్ వంటివి ఉంటాయి. మెరైన్లకు కావాల్సిన ఆహారం అందులో ఉండనుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హోర్ముజ్ జలసంధి వేదికగా నౌకా వార్ జరగడం ఖాయమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×