E-Paper
Advertisement

బరువు తగ్గేందుకు ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ సమస్యలున్నారు అసలు చేయకూడదు.. డాక్టర్ల హెచ్చరిక

బరువు తగ్గేందుకు ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ సమస్యలున్నారు అసలు చేయకూడదు.. డాక్టర్ల హెచ్చరిక
Advertisement

చాలామంది ఆరోగ్యం కోసం లేదా బరువు తగ్గడం కోసం ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేస్తుంటారు. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటల పాటు ఆహారం తినకుండా ఉపవాసం లాగా ఉండడం. ఉదాహరణకు వారంలో ఒక రోజు లేదా నెలలో కొన్ని రోజులు ఉపవాసం ఉండడం. ప్రతి రోజు 8 నుంచి 16 గంటల పాటు భోజనం తినకుండా నియంత్రించుకోవడం. అయితే ఇలా ఉపవాసం చేయడం అందరికీ ఆరోగ్యకరం కాదు. కొంతమందికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. బెంగళూరుకు చెందిన మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్‌టెంట్ డాక్టర్ అనుపమా ప్రకారం.. కొన్ని సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఫాస్టింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు ఫాస్టింగ్ చేయకూడదు

గర్భిణీ స్త్రీలు.. కడుపులో బిడ్డ ఆరోగ్యకరమైన వృద్ధికి.. క్రమం తప్పకుండా పోషకాలు తీసుకోవాలి. ఫాస్టింగ్ వల్ల పోషకాలు తగ్గి బిడ్డ అభివృద్ధికి అడ్డంకిగా ఉండొచ్చు. పాలు ఇచ్చే తల్లులు కూడా తమ శక్తి, పాల ఉత్పత్తి కోసం సమతుల్య ఆహారం తినాలి. ఫాస్టింగ్ వల్ల బలహీనత, అలసట, పోషకాల కొరత ఏర్పడవచ్చు.

డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఫాస్టింగ్ చేయకూడదు

Advertisement

డయాబెటిస్ ఉన్నవారు ఫాస్టింగ్ చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. ఇది తల తిరగడం, బలహీనత, గందరగోళం కలిగించవచ్చు. ప్రతి రోజు మందులు వాడేవారికి ఇంకా ప్రమాదం ఎక్కువ. ఫాస్టింగ్ చేయాలనుకుంటే తప్పకుండా డాక్టర్‌తో సంప్రదించి మందులు, ఆహారం సర్దుబాటు చేసుకోవాలి.

బరువు తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

బరువు తక్కువగా ఉన్నవారు లేదా శరీరం బలహీనంగా ఉన్నవారు ఫాస్టింగ్ చేయకూడదు. దీర్ఘకాలం ఆహారం మానేయడం వల్ల క్యాలరీలు తగ్గి పోషకాల కొరత, కండరాలు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. వారికి క్రమం తప్పకుండా సమతుల్య ఆహారం అవసరం.

తినే రుగ్మతలు ఉన్నవారు ఫాస్టింగ్ చేయకూడదు

Advertisement

అనోరెక్సియా అంటే సన్నగా శరీరం కావాలని సమస్య ఉన్నవారు, బులిమియా అంటే ఎక్కువగా తినడం లేదా తినకుంటే బలహీనమైపోయేవారు ఫాస్టింగ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే వారు ఫాస్ట్ ఫుడ్స్, లేదా అనారోగ్యకరమైన ఆహారం తినాలనే క్రేవింగ్స్ కలుగుతాయి. దీని వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. మానసిక ఆరోగ్య నిపుణులు సమతుల్య ఆహార విధానాలనే సూచిస్తారు.

పిల్లలు, టీనేజ్ వయసు వారు ఫాస్టింగ్ చేయకూడదు

పెరుగుతున్న పిల్లలు, టీనేజ్ వయసు వారికి క్రమం తప్పకుండా పోషకాలు అవసరం. ఫాస్టింగ్ వల్ల ఏకాగ్రత తగ్గి, అభివృద్ధి దెబ్బతింటుంది. వారికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం.

Also Read: చాణక్య నీతి.. వ్యక్తి నిజ స్వభావాన్ని బయటపెట్టే కఠిన పరిస్థితులు ఇవే..

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి

కిడ్నీ, గుండె, కాలేయం లేదా జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఫాస్టింగ్ చేయాలంటే తప్పకుండా డాక్టర్‌ను అడగాలి. మందులు, ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.

సైడ్ ఎఫెక్ట్స్

ఫాస్టింగ్ చేస్తే తలనొప్పి, చిరాకు, బలహీనత, నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. శరీరం సంకేతాలను గమనించి ఆపాలి.

సమతుల్య ఆహారమే మంచిది

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ కొందరికి మంచిదే కానీ అందరికీ కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నిద్ర, నీళ్లు తాగడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యం సాధించవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఏ డైట్‌నైనా ప్రారంభించాలి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×