E-Paper
Advertisement

Marnus Labuschagne: ఇండియా కంటే పాకిస్తాన్ బెట‌ర్‌..ఇక్క‌డ ఎంతో ప్ర‌శాంత‌త, గౌర‌వం !

Marnus Labuschagne: ఇండియా కంటే పాకిస్తాన్ బెట‌ర్‌..ఇక్క‌డ ఎంతో ప్ర‌శాంత‌త, గౌర‌వం !
Advertisement

Marnus Labuschagne: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. మే 30వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ సందర్భంగా రెండు జట్ల మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా ప్లేయర్లు అడుగుపెట్టారు. కీలక ప్లేయర్లు కొంతమంది ఐపిఎల్ ఆడుతుంటే మిగిలిన వాళ్ళందరూ పాకిస్తాన్ చేరుకున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ఇండియా కంటే పాకిస్తాన్ బెట‌ర్ – మార్నస్ లబుషేన్

Advertisement

మే 23వ తేదీన ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టింది. ఇక ఇవాళ రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా ప్రాక్టీస్ చేశాయి. అనంతరం రెండు టీమ్స్ క్రికెటర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కంటే పాకిస్తాన్ చాలా బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎంతో ప్రశాంతత అలాగే గౌరవం దక్కుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు మార్నస్ లబుషేన్. తాను పాకిస్తాన్ వచ్చినప్పుడు అల్లా ఒక రకమైన అనుభూతి కలుగుతోందని వివరించారు. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రశాంతత పాకిస్తాన్లో మాత్రమే తనకు దక్కుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తాను ఇప్పటికే పర్యటించాను.. ఇండియాకు వెళ్లాను… కానీ పాకిస్తాన్ లో మాత్రం అత్యంత ప్రేమ, గౌరవం, ఘనమైన స్వాగతాన్ని చూశాను అని వివరించారు. ఇతర దేశాల్లో ఇలాంటి సందర్భాలు తనకు ఎదురు కాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అభిమానులందరూ.. ఆస్ట్రేలియా క్రికెటర్లను చాలా గౌరవిస్తారని ప్రశంసించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు నెలరోజుల పాటు పాకిస్తాన్ దేశంలోనే గడిపానని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ అందమైన ప్రపంచానికి వచ్చానని పాకిస్తాన్ దేశాన్ని ప్రశంసించారు మార్నస్ లబుషేన్. దీంతో మార్నస్ లబుషేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడిన మార్నస్ లబుషేన్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో కూడా మార్నస్ లబుషేన్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. విదేశీ టోర్నమెంట్లలో కెప్టెన్ గా వ్యవహరించడం మార్నస్ లబుషేన్ కు ఇదే తొలిసారి. అయితే ఇతని కెప్టెన్సీలో హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు అద్భుతంగా రాణించిన ఫైనల్ దాకా దూసుకువెళ్లింది. ఈ అభిమానంతోనే తాజాగా పాకిస్తాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మార్నస్ లబుషేన్.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×