E-Paper
Advertisement

Broccoli For Weight Loss: బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్.. నిపుణులు చెబుతున్న బ్రోకలీ రెసిపీని ట్రై చేయండిలా!

Broccoli For Weight Loss: బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్.. నిపుణులు చెబుతున్న బ్రోకలీ రెసిపీని ట్రై చేయండిలా!
Advertisement

Broccoli For Weight Loss: కొంతమంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా.. నిపుణులు చెబుతున్న డైట్ ఫాలో అవుతున్నా కూడా అధిక బరువును తగ్గించుకోలేక పోతుంటారు. దీనికి కారణం వాళ్లు అనుసరించే డైట్ ప్లానింగ్ మిస్టేక్స్. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి క్యాలరీలు లేని ఆహారం ఏది? ఎప్పుడు తినాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి.. అనే విషయాలపై అవగాహన ఉండాలి. అందుకే.. శారీరక శ్రమ చేస్తున్నప్పటికీ బరువు తగ్గడంలో ఎలాంటి మార్పులు కనిపించవు. ఈ క్రమంలో బ్రోకలీని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చితే.. శరీరంలో జరిగే మార్పులేంటో చూద్దాం.

అల్పాహారం చాలా కీలకం:

బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే.. ఆ రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో అనవసరంగా ఎక్కువ తినే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఫైబర్ ఎక్కువగా ఉండేది బ్రోకలిలోనే. ఎందుకంటే.. దీనిలోని ఫైబర్ ఎక్కువసేపు పొట్టను నిండుగా ఉంచడంతో పాటు మీ జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

Advertisement

Also Read: శీతాకాలంలో ఇమ్యూనిటీకి అంజీర్ వరం.. డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో జరిగే మార్పులివే!

సింపుల్ & టేస్టీ రెసిపీ:

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రోకలితో తయారుచేసే ఓ సింపుల్ రెసిపీని ట్రై చేయవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రెసిపీని చాలా తక్కువ పదార్థాలతో, కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చారు. ఈ బ్రోకలీ వంటకంతో మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. మంచి శరీరాకృతిని కూడా పొందవచ్చు. దీని కోసం ఏమేం పదార్థాలు కావాలంటే..

Advertisement

బ్రోకలీ – పావు కిలో
వెల్లుల్లి – మూడు రెబ్బలు
మిరియాల పొడి – పావు టీ స్పూను
వేరుశనగలు – గుప్పెడు
చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడేంత
ఆలివ్ ఆయిల్ – రెండు టీ స్పూన్లు

తయారు చేసుకోండిలా:

ముందుగా బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాంతో పాటు చిల్లీ ఫ్లేక్స్‌ను కూడా తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరుక్కుని, వేరుశనగలను ఒకసారి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి.. సరిపడ ఆలివ్ ఆయిల వేసుకోవాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేదాకా తిప్పుతుండాలి. ఆ తర్వాత బ్రోకలీ, పల్లీలను కలిపి వేయించాలి. ఆ తర్వాత తరిగిన చిల్లీ ఫ్లేక్స్‌ను కలుపుకోవాలి. ఇక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని కలిపి.. ఐదు నిమిషాలపాటు వేయించుకుని చల్లారిన తర్వాత తింటే సరి.

బ్రోకలీతో బెనిఫిట్స్:

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో కూడి ఉంటుందీ బ్రోకలీ. దీనిలో C, K విటమిన్స్, ఫోలేట్‌తో పాటు అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇది చాలా తక్కువ క్యాలరీలతో ఉండటం ద్వారా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రోకలీలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Also Read: అరెరే.. ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగి ఆకులను ఎందుకు పడేస్తున్నాం?

 

 

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×