E-Paper
Advertisement

Tollywood Movies 2026: టాలీవుడ్‌కు కొత్త ఊరట… పదిరోజుల్లో 800 కోట్లకు పైగా కలెక్షన్లు..!

Tollywood Movies 2026: టాలీవుడ్‌కు కొత్త ఊరట… పదిరోజుల్లో 800 కోట్లకు పైగా కలెక్షన్లు..!
Advertisement

Tollywood Movies 2026: ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి శకునంతో మొదలైనట్లు కనిపిస్తోంది. జనవరి 9 నుంచి 19, 2026 వరకు తెలుగు సినిమా బాక్సాఫీస్ కొన్ని సెన్సేషన్స్ అవి చూసింది. అసలు విషయానికి వస్తే..కేవలం పదిరోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలై..అధికారిక లెక్కల ప్రకారం దాదాపు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు మంచి సంకేతమని చాలామంది భావిస్తున్నారు.

ఈ పదిరోజుల్లో విడుదలైన సినిమాలు ఒక్కోటి ఒక్కో రకమైన రిజల్ట్ ని చవిచూశాయి. ప్రభాస్ నటించిన రాజా సాబ్, చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ హీరోగా చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు..శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement

అయితే అన్ని సినిమాలకు.. ఒకేలా స్పందన రాలేదు. భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ సినిమా రాజా సాబ్ మొదటిరోజే ఆశించిన రెస్పాన్స్.. అందుకోలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా నుంచి భారీ వసూళ్లు వస్తాయని భావించారు. కానీ అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లు.. రాకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా మారింది.

ఇదే సమయంలో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మాత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా చిరంజీవి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన.. సినిమాగా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

Advertisement

శర్వానంద్ నటించిన సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ..థియేటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రావాల్సిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నవీన్ పోలిశెట్టి సినిమా కూడా కంటెంట్ పరంగా మంచి పేరు తెచ్చుకుని.. కలెక్షన్లలో నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు రవితేజ నటించిన సినిమా మాత్రం వసూళ్ల విషయంలో కొంచెం వెనుకబడి ఉంది.

కొన్ని సినిమాలు నిరాశ పరిచినా, కేవలం 10 రోజుల్లోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రావడం మాత్రం నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మళ్లీ సరైన దారిలో పడుతోందా అనే ప్రశ్నకు ఇది ఒక పాజిటివ్ సంకేతంగా మారుతోంది.

ALSO READ: Samantha Ruth Prabhu: కంఫర్ట్ డ్రెస్సింగ్…అమ్మాయిల బట్టలపైన సమంత వెర్షన్ ఇదే… పోస్ట్ వైరల్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×