E-Paper
Advertisement

Allu Arjun: మన శంకర వరప్రసాద్ గారు సినిమా పై బన్నీ రివ్యూ .. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ!

Allu Arjun: మన శంకర వరప్రసాద్ గారు సినిమా పై బన్నీ రివ్యూ .. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ!
Advertisement

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయింది. ఫ్యామిలీ ఎంటర్టైర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.

వింటేజ్ వైబ్స్ తో మన మెగాస్టార్..

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సైతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ షేర్ చేస్తూ..మన శంకర వరప్రసాద్ గారు సినిమా టీం మొత్తానికి అభినందనలు. ది బాస్ ఈజ్ బ్యాక్.. వింటేజ్ వైబ్స్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్లీ తెరపై చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక వెంకటేష్ గారు వెంకీ గౌడ పాత్రలో అదరగొట్టారని అల్లు అర్జున్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నటించిన నయనతార, మరొక హీరోయిన్ కేథరిన్ అద్భుతంగా నటించారని ముఖ్యంగా సంక్రాంతి స్టార్ బుల్లి రాజు కూడా అదిరగొట్టారంటూ ప్రతి ఒక్కరిపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేశారు.

సంక్రాంతి ‘బాస్ ‘ బస్టర్..

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట విజిల్ వేయించే విధంగా ఉందని, సంగీత దర్శకుడు భీమ్స్ పై , ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్లకు, నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటికి కూడా అభినందనలు తెలియజేశారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి కూడా మాట్లాడుతూ.. అనిల్ రావిపూడికి బిగ్గెస్ట్ కంగ్రాట్యులేషన్స్ ఆయన సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు… అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మిషన్. ఈ సినిమా సంక్రాంతి ఇది బ్లాక్ బాస్టర్ కాదని, ఇది సంక్రాంతి ‘బాస్ ‘ బస్టర్ అంటూ మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అల్లు అర్జున్ సుదీర్ఘమైన రివ్యూను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Advertisement

ఈ విధంగా చిరంజీవి సినిమాకి అల్లు అర్జున్ రివ్యూ ఇవ్వడంతో మెగా అల్లు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 జపాన్ లో విడుదలవుతున్న నేపథ్యంలో జపాన్ లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా చిరంజీవి సినిమా చూడడంతో అల్లు అర్జున్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

Also Read: Renu Desai: నన్ను కాపాడటానికి నా భర్త లేడు… అందుకే అక్కడికి వెళ్తా

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×