E-Paper
Advertisement

Telugu directors: ఈ ముగ్గురు దర్శకులు మామూలు కాదు, స్టార్ హీరోలతోనే అలా చేయించారు

Telugu directors: ఈ ముగ్గురు దర్శకులు మామూలు కాదు, స్టార్ హీరోలతోనే అలా చేయించారు

Telugu directors: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటారు. కేవలం సినిమాల్లో మాత్రమే తమ హుందాతనాన్ని చూపిస్తూ మామూలుగా చాలా సింపుల్ గా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వీరికి ఎంత పెద్ద స్టార్డం ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. అయితే వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు మారుస్తున్నారు.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. మొత్తానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. కల్కి సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

కల్కి ఈవెంట్ లో మార్పు 

కల్కి సినిమా ఈవెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఈవెంట్ కు ప్రభాస్ బుజ్జి తో ఎంట్రీ ఇచ్చారు. బుజ్జి అనే వెహికల్ ను కేవలం ఆ సినిమా కోసమే క్రియేట్ చేశారు. లాంగ్ హెయిర్ తో కల్కి సినిమాలోని గెటప్ లో ప్రభాస్ కనిపించాడు. అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ నేను ఈవెంట్ కి సింపుల్ గా వస్తాను అంటే ఒప్పుకోలేదు ఈ గెటప్స్ అన్నీ నాతో వేయించారు అంటూ మాట్లాడాడు ప్రభాస్.

పవన్ కళ్యాణ్ ఓజి

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓ జి. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమాతో ఫుల్ ఖుషి అయిపోయారు. ఆ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ నేను ఈవెంట్ కి మామూలుగా వస్తాను అంటే లేదు మీరు ఖచ్చితంగా బ్లాక్ వేసుకుని రావాల్సిందే. అంటూ నాతో కటనా పట్టించి ఈ రేంజ్ ఎంట్రీ ఇప్పించారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

మహేష్ బాబు వారణాసి 

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా. ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కూడా విపరీతమైన అంచనాలను నెలకొల్పింది.

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు నంది పైన ఎంట్రీ ఇచ్చి సినిమాలో కనిపించిన గెటప్ కాస్ట్యూమ్ లోనే కనిపించారు. దీని గురించి మహేష్ బాబు స్పందిస్తూ.. నేను చాలా సింపుల్ గా వస్తాను సార్ ఇప్పుడు నా టైపు లోనే బులుగు చొక్కా వేసుకొని వస్తాను అంటే అసలు కుదరదు అని నాకు ఈ షర్ట్ ఇచ్చారు. దీనికి అసలు గుండెలు కూడా లేవు. నెక్స్ట్ టైం షర్టు లేకుండా రమ్మంటారేమో అని మహేష్ బాబు మాట్లాడారు. మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ హీరోలను దర్శకులు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చే అభిమానులు ఆనందపడేలా చేశారు.

Also Read: Varanasi: ఏంటి జక్కన్న ఇది.. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా? డెడికేషన్ అంటే నీదే సామీ

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×