ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఆఫీసులు, ఇల్లు, స్కూల్స్, ప్రయాణాల్లో కూడా చాలామంది వీటినే ఉపయోగిస్తున్నారు. ఇవి తేలికగా ఉండటంతో పాటు సులభంగా తీసుకెళ్లే వీలుంటుంది. అందుకే చాలా మంది వీటిని ప్రతిరోజూ వాడుతున్నారు.
చాలామంది ఒకే ప్లాస్టిక్ బాటిల్ నెలల తరబడి వాడుతుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది ప్రమాదకరం. కాలక్రమంలో బాటిల్‌పై చిన్న చిన్న గీతలు పడతాయి. ఆ గీతల్లో దుమ్ము, మురికి, బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. బాటిల్‌ను సరిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. అలాంటి నీళ్లు తాగితే అవి శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది.
చాలామంది బాటిల్స్.. కార్లలో లేదా నేరుగా ఎండలో ఉంచేస్తారు. ఎక్కువ వేడి కొన్ని రకాల ప్లాస్టిక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌లోని కొన్ని పదార్థాలు నీళ్లలో కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ వేడికి గురైన బాటిల్స్‌లో నీళ్లను తాగకుండా ఉండటం మంచిది.
నాసిరకం ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువకాలం వాడటం వల్ల శరీరంలో కెమికల్ రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండదు. బాటిల్ క్వాలిటీ, దాన్ని వాడే విధానం, నిల్వ చేసే పరిస్థితులు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
వాటర్ బాటిల్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా బాటిల్ మూత, తాగే భాగంలో మురికి త్వరగా పేరుకుపోతుంది. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. లేకపోతే పరిశుభ్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికీ హాని కలిగిస్తుంది. వీటి వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయి. అవి పూర్తిగా కరిగిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే సరైన విధంగా బాటిల్స్ పారవేయకపోతే కాలుష్యం పెరిగి ప్రకృతికి నష్టం కలుగుతుంది.
Also Read: ఉదయం వేళ ఎండతో ఎన్నో లాభాలు.. సమయం లేదా అయితే ఈ ఫుడ్స్ తినండి
ప్రతిరోజూ బాటిల్‌ను శుభ్రంగా కడగండి. నేరుగా ఎండలో లేదా వేడిగా ఉండే ప్రదేశాల్లో బాటిల్స్ ఉంచకూడదు. గీతలు పడిన లేదా ఆకారం మారిన బాటిల్స్ వెంటనే మార్చేయండి. వీలైనప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గాజు బాటిల్స్ ఉపయోగించడం మంచిది.
బాటిల్ నుంచి దుర్వాసన రావడం.
రంగులో మార్పు కనిపించడం.
బాటిల్ ఉపరితలం గరుకుగా మారడం.
తరచూ కడిగినా మురికి తొలగకపోవడం.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సౌకర్యవంతంగా ఉన్నా, వాటిని జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం. సరైన శుభ్రత, సరైన నిల్వ, అవసరమైనప్పుడు బాటిల్ మార్పు వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటంలో ఉపయోగపడతాయి.