E-Paper
Advertisement

‘దృశ్యం 3’లో కనిపించిన నంబర్ ప్లేట్ అసలెవరిది? కేరళలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం

‘దృశ్యం 3’లో కనిపించిన నంబర్ ప్లేట్ అసలెవరిది? కేరళలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం
Advertisement

Drishyam 3 Number Plate Controversy: మల్లూ వుడ్ నే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ‘దృశ్యం’. హీరో జార్జ్‌కుట్టి పోలీసుల కళ్లు కప్పి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే పాయింట్‌తో దర్శకుడు జీతూ జోసెఫ్ సృష్టించిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ అయిపొయింది.

2013లో విడుదలైన మొదటి భాగం ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో పాటు చైనీస్ భాషలోకి కూడా రీమేక్ అయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు, అంటే 2021లో డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ‘దృశ్యం 2’ కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషం. అయితే ఇపుడు వచ్చిన మూడో భాగం ఆ స్థాయి సక్సెస్ చూళ్ళేదనే చెప్పాలి.

టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన నంబర్ ప్లేట్ 

Advertisement

ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సినిమాలో కనిపించిన ఒక నంబర్ ప్లేట్ వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.అవును..‘దృశ్యం 3’ లో మోహన్‌లాల్ వాడిన ఒక వాహనానికి, తన సొంత కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారని రాజీవ్ అనే సామాన్య వ్యక్తి కేసు వేశాడు.కేరళలోని ఇడుక్కి జిల్లా కుంచితన్నీ ప్రాంతానికి చెందిన ఇతను దీనికి గల పక్కా ఆధారంగా తన వాహనానికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) కాపీని కూడా పోలీసులకు అందజేశారు. తన అనుమతి లేకుండా వాడిన ఆ నంబర్ ప్లేట్ దృశ్యాలను సినిమా నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

also read :పెద్ది టికెట్ రేట్లపై హైకోర్టు సీరియస్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కోర్టు!

ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్

Advertisement

ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన మరియు గందరగోళానికి గురిచేసే అంశం ఏమిటంటే, రాజీవ్ వద్ద ఉన్న వాహనం బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో. కానీ సినిమాలో మోహన్‌లాల్ పాత్ర నడుపుతున్నట్లు చూపించిన వాహనం పూర్తిగా వేరే మోడల్‌కు చెందింది. మోడల్స్ వేరైనా నంబర్ మాత్రం ఒక్కటే కావడంతో రాజీవ్ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఇటువంటి పెద్ద సినిమాల షూటింగ్స్ సమయంలో ప్రొడక్షన్ టీమ్ డమ్మీ నంబర్ ప్లేట్స్ వాడటం లేదా రవాణా శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవడం చేస్తుంటుంది. కానీ, ‘దృశ్యం 3’ వంటి క్రేజ్ ఉన్న ప్రాజెక్టు విషయంలో మేకర్స్ ఇలాంటి చిన్న పొరపాటు ఎలా చేసిందనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.

మోహన్‌లాల్ వాడే కారు ఇదేనా అంటూ

సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన లీకైన కొన్ని షూటింగ్ చిత్రాలు, చర్చలు వైరల్ అవ్వడంతో రాజీవ్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. లోకల్ యూత్  మరియు ఆయన ఫ్రెండ్స్  ఆ నంబర్ చూసి, ‘దృశ్యం 3’లో మోహన్‌లాల్ వాడే కారు ఇదేనా అంటూ ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ఒకవేళ భవిష్యత్తులో ఈ నంబర్ ఉన్న కారుతో సినిమాలో ఏదైనా నేరపూరితమైన సీన్ చూపిస్తే, సమాజంలో తనకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని, రేపు ఏదైనా చట్టపరమైన సమస్య తలెత్తితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తానే తిరగాల్సి వస్తుందని రాజీవ్ భయపడుతున్నారు. ఒకవేళ చిత్ర యూనిట్ దీనిపై స్పందించి సమస్యను పరిష్కరించకపోతే డైరెక్టర్ జీతూ జోసెఫ్, ప్రొడ్యూసర్ ఆంటోనీలపై కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలకు వెళ్తానని ఆయన హెచ్చరించారు.

సినిమా రంగంలో ఇలాంటి నంబర్ ప్లేట్ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఇలా నిజమైన నంబర్లను వాడటం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఈ చిన్న విషయం కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది.చూడాలి మరి ఈ వివాదంపై జీతు ఎలా రియాక్ట్ అవుతాడో !

also read :జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదం.. ఇండైరెక్ట్‌గా బుచ్చిబాబుకు సపోర్ట్ చేసిన లేడీ డైరెక్టర్!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×