E-Paper
Advertisement

Itchy Scalp: తలపై దురదతో.. ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Itchy Scalp: తలపై దురదతో.. ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !
Advertisement

Itchy Scalp: తలపై దురద అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్య. ఇది కేవలం అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. పది మందిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. తల దురదకు అనేక కారణాలు ఉంటాయి. తల దురదకు గల ప్రధాన కారణాలు, వాటిని తగ్గించుకోవడానికి ఎలాంటి హోం రెమెడీస్ వాడాలనే విషయాలను గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తల దురదకు ప్రధాన కారణాలు:

తలలో చుండ్రు : తల దురదకు అత్యంత సాధారణ కారణం చుండ్రు. తల చర్మం పొడిబారడం లేదా జిడ్డుగా మారడం వల్ల తెల్లని పొట్టులా ఊడిపోతూ దురదను కలిగిస్తుంది.

Advertisement

పొడి చర్మం: వాతావరణంలో మార్పులు లేదా వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల చర్మం తేమను కోల్పోయి పొడి బారుతుంది. దీని వల్ల దురద వస్తుంది.

పేలు : తలలో పేలు ఉండటం వల్ల అవి రక్తాన్ని పీల్చే.. క్రమంలో విపరీతమైన దురదను కలిగిస్తాయి. ఇది ఎక్కువగా పాఠశాలకు వెళ్లే పిల్లల్లో కనిపిస్తుంది.

రింగ్‌వార్మ్ : శిలీంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల తలపై ఎర్రటి దద్దుర్లు, దురద, జుట్టు రాలడం వంటివి జరుగుతాయి.

అలెర్జీలు: మనం ఉపయోగించే షాంపూలు, హెయిర్ డైలు లేదా ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ పడకపోవడం వల్ల తల దురద వస్తుంది.

సోరియాసిస్: ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. దీని వల్ల తలపై వెండి రంగు పొలుసులు ఏర్పడి తీవ్రమైన దురదను కలిగిస్తాయి.

నివారణ మార్గాలు :

దురద మరీ తీవ్రంగా లేనప్పుడు కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు.

వేప నూనె లేదా వేప నీరు: వేపలో యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులను నీటిలో మరిగించి..ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తల చర్మానికి పట్టించాలి. ఇది తల చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేసి దురదను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె: పొడి చర్మం వల్ల వచ్చే దురదకు కొబ్బరి నూనె అద్భుతమైన పరిష్కారం. కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేస్తే చర్మానికి తేమ అందుతుంది.

టీ ట్రీ ఆయిల్: మీ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి వాడటం వల్ల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలోవెరా (కలబంద): కలబంద జెల్‌ను నేరుగా తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని చల్లబరిచి మంటను, దురదను తగ్గిస్తుంది.

Also Read: చేతులు, గోళ్ల ద్వారా తెలుసుకోగలిగే 7 ఆరోగ్య సమస్యలు

జాగ్రత్తలు:

ఎప్పుడూ గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయండి. అతిగా వేడి నీరు వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది.

మరొకరి దువ్వెనలు, టోపీలు లేదా తువ్వాళ్లు వాడకండి.

కెమికల్స్ తక్కువగా ఉన్న మైల్డ్ షాంపూలను ఎంచుకోండి.

వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తూ తలని శుభ్రంగా ఉంచుకోండి.

తల దురద సాధారణంగా.. చిన్న చిన్న జాగ్రత్తలతో తగ్గిపోతుంది. అయితే.. తలపై కురుపులు కావడం, రక్తం రావడం లేదా పైన చెప్పిన చిట్కాలు పాటించినా తగ్గకపోతే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×